NTV Telugu Site icon

Gold Rate Today: గోల్డ్ లవర్స్‌కి గుడ్‌న్యూస్.. తగ్గుముఖం పడుతున్న పసిడి ధరలు!

Today Gold Price

Today Gold Price

గత కొంతకాలం నుంచి బంగారం ధరలు నాన్‌ స్టాప్‌గా పరుగులు పెడుతూ.. రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఓ దశలో తులం బంగారం రూ.93 వేలకు పైగా దూసుకెళ్లింది. అయితే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ బాదుడుతో ఈ 3-4 రోజులుగా పసిడి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. శుక్రవారం, శనివారం భారీగా తగ్గి నిన్న స్థిరంగా ఉన్న గోల్డ్ రేట్స్.. నేడు మరలా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.250, 24 క్యారెట్లపై రూ.280 తగ్గింది.

బులియన్ మార్కెట్‌లో సోమవారం (ఏప్రిల్ 7) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,850గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.90,380గా నమోదయింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యత్యాసం ఉంటుందన్నా విషయం తెలిసిందే. సోమవారం ఉదయం 10 గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరలు ఇవి.

Also Read: Shubman Gill: సిరాజ్‌ సూపర్.. బ్యాటర్ల కంటే బౌలర్లే గేమ్‌ ఛేంజర్లు!

మరోవైపు దేశంలో బంగారంతో పాటు వెండికీ మంచి గిరాకీనే ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వెండి ధరలను కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ముఖ్యం. ఈ వారం రోజుల్లో వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. వరుసగా మూడు రోజులు భారీగా పతనమైన వెండి.. రెండు రోజులుగా స్థిరంగా ఉంటోంది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి నేడు రూ.94,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ఒక లక్ష 3 వేలుగా నమోదైంది. దేశంలో అత్యల్పంగా బెంగళూరు, ఢిల్లీ, ముంబై, పూణే నగరాల్లో రూ.94,000గా కొనసాగుతోంది. గత వారంలో బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.1,05,000గా నమోదైన విషయం తెలిసిందే.