NTV Telugu Site icon

Gold Rate Today: ఈ పెరుగుదలకు అంతేలేదా?.. తులం బంగారం ఎంతకు చేరిందో తెలుసా?

Today Gold Price

Today Gold Price

కొన్నిరోజుల ముందు తులం బంగారం ధర రూ.82 వేలను దాటింది. ఇక లక్షకు చేరుకుంటుందని అంతా అనుకున్నారు. అమెరికా ఎన్నికల అనంతరం వరుసగా తగ్గుతూ.. రూ.75 వేలకు చేరింది. దాంతో వినియోగదారులకు కాస్త ఊరట కలిగింది. అయితే ఆ సంతోషం వారం కూడా లేదు. తగ్గినట్టే తగ్గిన గోల్డ్ రేట్స్.. మళ్లీ పరుగులు పెడుతున్నాయి. ఎంతలా అంటే.. వరుసగా ఆరోరోజు పసిడి ధర భారీగా పెరిగింది. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.750 పెరగగా.. 24 క్యారెట్లపై రూ.820 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో శనివారం (నవంబర్ 23) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.73,000గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.79,640గా నమోదైంది.

మరోవైపు వెండి ధర మాత్రం వరుసగా మూడోరోజు స్థిరంగా ఉంది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.92,000గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి లక్ష ఒక వెయ్యిగా ఉంది. అత్యల్పంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో 92 వేలుగా నమోదైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.73,000
విజయవాడ – రూ.73,000
ఢిల్లీ – రూ.73,150
చెన్నై – రూ.73,000
బెంగళూరు – రూ.73,000
ముంబై – రూ.73,000
కోల్‌కతా – రూ.73,000
కేరళ – రూ.73,000

24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.79,640
విజయవాడ – రూ.79,640
ఢిల్లీ – రూ.79,790
చెన్నై – రూ.79,640
బెంగళూరు – రూ.79,640
ముంబై – రూ.79,640
కోల్‌కతా – రూ.79,640
కేరళ – రూ.79,640

Also Read: AUS vs IND: ఐదేసిన బుమ్రా.. 104 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్!

కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.1,01,000
విజయవాడ – రూ.1,01,000
ఢిల్లీ – రూ.92,000
ముంబై – రూ.92,000
చెన్నై – రూ.1,01,000
కోల్‎కతా – రూ.92,000
బెంగళూరు – రూ.92,000
కేరళ – రూ.1,01,000

Show comments