Site icon NTV Telugu

Gold Rate Today: లక్ష కాదు అంతకు మించి.. లక్ష దాటిన బంగారం ధర

Gold Rates Drop

Gold Rates Drop

భారతదేశంలో బంగారం పరుగులు ఆగట్లేదు. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా జెట్ స్పీడులో పరుగులు తీస్తున్నాయి. ఈ క్రమంలో బంగారం ధరలు నేడు చరిత్రాత్మక మైలురాయిని చేరుకున్నాయి. బులియన్ మార్కెట్‌లో పసిడి ధర లక్ష దాటింది. దాంతో పేద, మధ్య తరగతి కుటుంబాలు పసిడి వైపు కన్నెత్తి కూడా చూసే పరిస్థితి లేకుండా పోయింది. ప్రస్తుతం శుభకార్యాలకు బంగారం కొనాలన్నా.. ఎంతో ఆలోచించాల్సి వస్తోంది.

ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.3,000 పెరగగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.2,750 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (ఏప్రిల్ 22) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.92,900గా.. 24 క్యారెట్ల ధర రూ.1,01,350గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖ, విజయవాడలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

మరోవైపు ఇప్పటికే వెండి ధర లక్ష దాటిన విషయం తెలిసిందే. నిన్న కిలో వెండిపై రూ.1000 పెరగగా.. ఈరోజు స్థిరంగా ఉంది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ఈరోజు రూ.1,01,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో కిలో వెండి రూ.1,11,000గా ఉంది. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యత్యాసం ఉంటుందన్న విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం 10 గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరలు ఇవి.

Exit mobile version