NTV Telugu Site icon

Gold Rate Today: గోల్డ్ లవర్స్‌కు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు!

Gold Rate Today

Gold Rate Today

గత కొన్ని నెలలుగా బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా పసిడి కనీవినీ ఎరుగని రీతిలో పెరిగి.. భారత మార్కెట్‌లో కొత్త రికార్డులు నెలకొల్పింది. నేటికీ బంగారం పెరుగుదల ఆగడం లేదు. ఈ క్రమంలోనే 89 వేలకు చేరువైంది. నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.490 పెరగగా.. నేడు రూ.600 పెరిగింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాములపై రూ.450, రూ.550 పెరిగింది. గురువారం (మార్చి 13) బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.88,580గా.. 22 క్యారెట్ల ధర రూ.81,200గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

Also Read: IPL 2025: ఆశలు రేకెత్తిస్తున్న కొత్త కెప్టెన్‌.. ఈసారి పంజాబ్‌ రాత రానేనా!

మరోవైపు వెండి ధరలు కూడా షాక్ ఇస్తున్నాయి. వరుసగా రెండో రోజు సిల్వర్ రేట్స్ భారీగా పెరిగాయి. కిలో వెండిపై నిన్న 2 వేలు పెరగగా.. ఈరోజు వెయ్యి పెరిగింది. గురువారం బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.1,01,000గా కొసనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ఒక లక్ష 10 వేలుగా ఉంది. దేశంలో అత్యల్పంగా బెంగళూరు, ఢిల్లీ, ముంబైలలో రూ.1,01,000గా నమోదైంది. బంగారం, వెండి ధరలు ఆయా రాష్ట్రాల్లో వేరువేరుగా ఉంటాయన్న విషయం తెలిసిందే. ఈ ధరలు ఈరోజు ఉదయం 10 గంటలకు నమోదయ్యాయి.