NTV Telugu Site icon

Gold Rate Today: మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతుందంటే?

Gold Price Today

Gold Price Today

గత కొంతకాలం నుంచి బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో పసిడి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అయితే గత 4-5 రోజలుగా తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేట్స్.. నేడు మరలా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.110 పెరగగా.. 22 క్యారెట్లపై రూ.100 పెరిగింది. బుధవారం (మార్చి 26) బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,400గా.. 22 క్యారెట్ల ధర రూ.81,950గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

Also Read: Glenn Maxwell: అయ్యో మ్యాక్స్‌వెల్.. ఎంతపనాయే!

మరోవైపు వెండి ధరలు కూడా కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. వరుసగా రెండో రోజులు తగ్గి, ఆపై మూడు రోజులు స్థిరంగా ఉన్న సిల్వర్ రేట్ నేడు పెరిగింది. కిలో వెండిపై ఒక వెయ్యి పెరిగి.. బులియన్ మార్కెట్‌లో రూ.1,02,000గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ఒక లక్ష 11 వేలుగా నమోదైంది. దేశంలో అత్యల్పంగా బెంగళూరు, ఢిల్లీ, ముంబైలలో రూ.1,02,000గా ఉంది. బంగారం, వెండి ధరలు ఆయా రాష్ట్రాల్లో వేరువేరుగా ఉంటాయన్న విషయం తెలిసిందే. ఈ ధరలు ఈరోజు ఉదయం 10 గంటలకు నమోదయ్యాయి.