Gold Rate Today: ఆల్‌టైమ్ హైకి గోల్డ్ రేట్లు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు ఇలా!

  • గోల్డ్ లవర్స్‌కి అలర్ట్
  • స్థిరంగా వెండి రేట్లు
  • తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ఎంతంటే?
Today Gold Price

Today Gold Price

గత కొన్ని నెలలుగా బంగారం ధరలు ‘రన్ రాజా రన్’ అంటూ పరుగు తీస్తున్నాయి. ఇటీవలి రోజల్లో వరుసగా పెరుగుతూ.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82వేలు దాటింది. బంగారం ధరల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఆల్‌టైమ్ హైకి చేరుకుంది. నేడు బంగారం ధరలు స్థిరంగా ఉన్నా.. నిన్న రూ.860 పెరిగింది. ప్రస్తుతం బంగారం అంటేనే కొనుగోలుదారులు భయపడుతున్నారు. బులియన్ మార్కెట్‌లో గురువారం (జనవరి 23) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.75,250గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.82,090గా నమోదైంది.

మరోవైపు వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. వరుసగా ఆరో రోజు వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.96,500గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖ, విజయవాడలో కిలో వెండి ఒక లక్ష నాలుగు వేలుగా ఉంది. దేశంలో అత్యల్పంగా బెంగళూరు, ఢిల్లీ, ముంబైలలో రూ.96,500గా నమోదయింది.

22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.75,250
విజయవాడ – రూ.75,250
ఢిల్లీ – రూ.75,400
చెన్నై – రూ.75,250
బెంగళూరు – రూ.75,250
ముంబై – రూ.75,250
కోల్‌కతా – రూ.75,250
కేరళ – రూ.75,250

24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.82,090
విజయవాడ – రూ.82,090
ఢిల్లీ – రూ.82,240
చెన్నై – రూ.82,090
బెంగళూరు – రూ.82,090
ముంబై – రూ.82,090
కోల్‌కతా – రూ.82,090
కేరళ – రూ.82,090

Also Read: Varun Chakravarthy: ఈడెన్‌లో అంత ఈజీ కాదు.. నా బౌలింగ్‌కు రేటింగ్ 7/10!

కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.1,04,000
విజయవాడ – రూ.1,04,000
ఢిల్లీ – రూ.96,500
ముంబై – రూ.96,500
చెన్నై – రూ.1,04,000
కోల్‎కతా – రూ.96,500
బెంగళూరు – రూ.96,500
కేరళ – రూ.1,04,000