బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి.. ఈరోజు ధరలు షాక్ ఇస్తున్నాయి.. మరోవైపు వెండి ధరలు కూడా భారీగా పెరగడంతో సామాన్యులకు పెను భారంగా మారింది.. మంగళవారం ఒక్కరోజే రూ.800 మేర పెరిగి రూ.65 వేలకు చేరింది. రూ.64,200 వద్ద ముగిసింది. ఇక వెండి కేజీ 900 రూపాయల మేర పెరిగి 74,900కు చేరింది. అలాగే బుధవారం కూడా బంగారం, వెండి ధరల్లో స్వల్పంగా పెరుగుదల కనిపిచింది. ఇవాళ ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,160, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.65,630 ఉంది.. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,460,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.64,860 గా ఉంది.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,610, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.65,010 గా కొనసాగుతుంది.. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో పసిడి ధరలు పరుగులు పెట్టాయి. 24 క్యారెట్ 10 గ్రాములు రూ.760 ఎగిసి రూ.64,850గా ఉన్నది. 22 క్యారెట్ రూ.700 పెరిగి రూ.59,450కి చేరింది..
ఇక వెండి ధరల విషయానికొస్తే.. బంగారం బాటలోనే నడిచింది.. కిలో వెండి పై రూ.900 ఎగిసి రూ.74,900లను తాకింది. ఇక హైదరాబాద్‌లోనైతే రూ.1,200 ఎగబాకి రూ.78,200లకు చేరింది. మిగిలిన ప్రధాన నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.. ఇక రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..