Gold Price Hike : గత కొద్దిరోజులుగా బంగారం ధరలు పెరుగుతూ పోతున్నాయి. నిన్న కాస్త శాంతించింది అనుకునే లోపే ఈ రోజు మళ్లీ బంగారం ధరలు పెరిగాయి. గోల్డ్ ధర 80 వేల మార్క్ దాటేసింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. బులియన్ మార్కెట్‌లో బుధవారం (అక్టోబర్ 26) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.65 పెరిగి.. రూ.73,600గా నమోదైంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.71 పెరిగి.. రూ.80,290గా కొనసాగుతోంది. గోల్డ్ ధర 80 వేలు దాటడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. బంగారం ధర 80 వేలు మార్క్ దాటేయగా.. సిల్వర్ కూడా అదే బాటలో దూసుకుపోతోంది. ప్రస్తుతం లక్ష మార్క్ దాటేసి.. పరుగులు పెడుతోంది. ఈరోజు బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై ఎలాంటి మార్పు లేదు. లక్షా ఏడు వేలుగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో కిలో వెండి లక్షా ఏడు వేలుగా నమోదైంది
భారత్‌లోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు (10 గ్రాములు)
నగరం 22క్యారెట్లు 24క్యారెట్లు
చెన్నై రూ. 7,360 రూ. 8,029
ముంబయి రూ. 7,360 రూ. 8,029
న్యూఢిల్లీ రూ. 7,375 రూ. 8,044
కోల్కతా రూ. 7,360 రూ. 8,029
బెంగళూరు రూ. 7,360 రూ. 8,029
హైదరాబాద్ రూ. 7,360 రూ. 8,029