NTV Telugu Site icon

Gold Rate Today: పండగ వేళ మహిళలకు షాక్.. మరోసారి 80 వేలు దాటిన గోల్డ్ రేట్స్!

Gold Price Today

Gold Price Today

దీపావళి పండగ దగ్గరికి వస్తోన్న నేపథ్యంలో మహిళలకు బులియన్ మార్కెట్ షాక్ ఇచ్చింది. నిన్న పసిడి ధరలు భారీగా తగ్గగా.. నేడు అంతకు మించి అన్నట్లుగా పెరిగాయి. నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.450 తగ్గితే.. నేడు రూ.600 పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.490 తగ్గితే.. రూ.650 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (అక్టోబర్ 29) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,750గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.80,450గా ఉంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,750గా నమోదవగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.80,450గా ఉంది. విజయవాడ, విశాఖపట్టణంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. చెన్నై, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, కేరళ, పూణేలలో 22 క్యారెట్ల ధర రూ.73,750గా.. 24 క్యారెట్ల ధర రూ.80,450గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,900గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.80,600గా ఉంది.

Also Read: Samsung Galaxy S23 Ultra: నెవర్ బిఫోర్ ఆఫర్‌.. లక్షా 50 వేల ఫోన్‌ 49 వేలకే!

మరోవైపు వరుసగా మూడు రోజులు స్థిరంగా ఉన్న వెండి ధర కూడా పెరిగింది. బులియన్ మార్కెట్‌లో నేడు కిలో వెండిపై వెయ్యి పెరిగి.. రూ.99,000గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ.1,06,900గా ఉంది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతాలలో 99 వేలుగా నమోదైంది. చెన్నైలో రూ.1,08,000గా కొనసాగుతోంది.

Show comments