ఇటీవల కాలంలో బంగారం ధరల్లో భారీగా హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ.. తగ్గుతూ.. పెరుగుతూ.. స్థిరంగా ఉంటూ పసిడి ధరలు ఊగిసలాడుతున్నాయి. ఇక రెండు రోజులుగా స్థిరంగా ఉన్న గోల్డ్ రేట్స్ నిన్న తగ్గగా.. నేడు పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.100, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.100 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో బుధవారం (డిసెంబర్ 25) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.71,000గా.. 24 క్యారెట్ల ధర రూ.77,450గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో ఇవే రేట్స్ కొనసాగుతున్నాయి.
Also Read: Varun Dhawan: అలియా, కియారాలతో తప్పుగా ప్రవర్తించలేదు: వరుణ్
మరోవైపు వెండి ధరలు కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. వెండి కూడా గత కొన్ని రోజులుగా పెరుగుతూ.. తగ్గుతూ వస్తోంది. నిన్న స్థిరంగా ఉన్న వెండి.. నేడు స్వల్పంగా పెరిగింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.100 పెరిగి.. రూ.91,500గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర 99 వేలుగా కొనసాగుతోంది. అత్యల్పంగా బెంగళూరు, ఢిల్లీ, ముంబై, పూణే నగరాల్లో రూ.91,500గా ఉంది.