BJP Meeting: సంగారెడ్డిలో భారతీయ జనతా పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పులిమామిడి రాజు కమలం పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా స్థానిక అంబేడ్కర్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన పార్టీ విజయ సంకల్ప సభను బీజేపీ నేతలు సక్సెస్ పుల్ గా నిర్వహించారు. ఈ సభలో కిషన్ రెడ్డి ప్రసంగించారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసిందని ఆయన విమర్శించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రభుత్వ భూములు అమ్ముకున్న సొమ్ముతో చెల్లించే పరిస్థితికి వచ్చిందన్నారు. మరో 90 రోజుల్లో ఎన్నికలు జరుగుతాయని, అప్పుడు రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు.
Read also: Jawan Collections: 530 కోట్లు… రేర్ ఫీట్ సాధించిన మొదటి బాలీవుడ్ సినిమా
ఈ బహిరంగ సభలో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల మాట్లాడుతూ.. ప్రధాని మోడీ దేశాన్ని ప్రపంచ గురువుగా నిలుపుతున్నారని అన్నారు. సమర్ధవంతమైన పాలనతో ప్రగతి పథంలో పయనిస్తున్నారని ఆయన కొనియాడారు. ఇక, ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ లో బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభకు కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి గోదావరి అంజిరెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో.. ఎలక్షన్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, దుబ్బాక శాసనసభ్యులు రఘునందన్ రావు, రాష్ట్ర నాయకులు అశ్వద్ధామ రెడ్డి పాల్గొన్నారు. సంగారెడ్డికి విచ్చేస్తున్న సందర్భంగా దుబ్బాక పాలక్ డాక్టర్ అంజిరెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు శ్రీమతి గోదావరి అంజి రెడ్డి, రాష్ట్ర నాయకులు శంకర్ యాదవ్, దేవేందర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Food Poisoning: కస్తూర్బా విద్యాలయంలో ఫుడ్ పాయిజన్.. ఆసుపత్రిలో 80 మంది విద్యార్ధినిలు