Glenn Maxwell: డిసెంబర్ 16న ఐపీఎల్ 2026 వేలం జరగనున్న విషయం తెలిసిందే. ఈ వేలంలో పాల్గొనడానికి 1355 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా వచ్చే ఏడాది ఐపీఎల్ నుంచి ఓ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిటైర్ అయ్యి క్రికెట్ ఫ్యాన్స్‌కు షాక్‌కు గురి చేశాడు వాస్తవానికి ఈ స్టార్ ప్లేయర్ రిజిస్టర్డ్ ఆటగాళ్ల జాబితాలో చేరలేదు. ఐపీఎల్ 2026కి దూరంగా ఉండాలనే నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యపరిచిన ఆ స్టార్ ప్లేయర్ ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్వెల్. ఐపీఎల్ 2026 వేలంలో ఆయన తన పేరును నమోదు చేసుకోలేదు.
READ ALSO: Pemmasani Chandrasekhar : అందుకే.. సంచార్ సాథీ యాప్..
గ్లెన్ మాక్స్‌వెల్ IPL 2025లో పంజాబ్ కింగ్స్ తరుఫున మైదానంలోకి దిగాడు. ఈ ఫ్రాంచైజీ మాక్స్‌వెల్‌ను ₹4.2 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే IPL 2026 వేలానికి ముందు పంజాబ్ మాక్స్‌వెల్‌ను విడుదల చేసింది. మాక్స్‌వెల్ పంజాబ్ జట్టు నుంచి బయటికి వచ్చిన తర్వాత, చాలా ఫ్రాంచైజీలు ఈ స్టార్ ప్లేయర్‌పై కన్నేశాయి. కానీ ఆయన మాత్రం ఈ వేలంలో తన పేరును నమోదు చేసుకోలేదు. దీంతో ఈ ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ తాను IPL 2026లో ఆడనని స్పష్టం చేశాడు.
వాస్తవానికి ఐపీఎల్ 2026 కి మాక్స్వెల్ తన పేరు రిజిస్టర్ చేసుకోకపోవడానికి వెనుక గల కారణం ఇంకా వెల్లడి కాలేదు. ఐపీఎల్ 2026 వేలంలో పాల్గొనకూడదనే తన నిర్ణయాన్ని మాక్స్వెల్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించాడు. ఇది ఒక పెద్ద నిర్ణయం అని ఆయన ఈ పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఐపీఎల్ తాను క్రికెటర్‌గా ఎదగడానికి సహాయపడిందని, అయితే ఈ వేలంలో ఎందుకు పాల్గొనలేదో ఆయన వివరించలేదు. మాక్స్వెల్ ఈ పోస్ట్ చివర్లో తన అభిమానులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు.
ఐపీఎల్ టోర్నమెంట్‌లో మాక్స్వెల్ ఇప్పటి వరకు నాలుగు జట్ల తరపున మొత్తం 13 సీజన్లు ఆడాడు. ఈ స్టార్ ప్లేయర్ 2012లో IPLలోకి అడుగుపెట్టాడు. అప్పటి నుంచి IPL ద్వారా సుమారు రూ.92 కోట్లు (సుమారు $1.25 బిలియన్) సంపాదించినట్లు సమాచారం. IPL 2021లో ఈ స్టార్ ప్లేయర్‌ను RCB కొనుగోలు చేసినప్పుడు మాక్స్వెల్ అత్యధిక జీతం రూ.14.25 కోట్లు (సుమారు $1.425 బిలియన్) అందుకున్నాడు. ఇక ఇటీవల కాలంలో వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్‌లో ఆడట్లేదని పలువురు విదేశీ స్టార్ ప్లేయర్లు ప్రకటించారు. రిటైర్మెంట్ ప్రకటించిన వారిలో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్, సౌతాఫ్రికా స్టార్ ఫాఫ్ డుప్లెసిస్, ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ ఉన్నారు.
READ ALSO: December 2 Significance: డిసెంబర్ 2 ప్రాముఖ్యత, ప్రత్యేకతలు ఇవే..
