Site icon NTV Telugu

Getup Srinu: ఏమైంది బ్రో.. ఇంత సంచలన నిర్ణయం తీసుకున్నావు..

Getup Srinu

Getup Srinu

గెటప్ శ్రీను జబర్దస్త్ లో మంచి కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు. జబర్దస్త్ లో మంచి కమెడియన్‌గా, సినిమాల్లో నటుడిగా కూడా రాణిస్తున్నారు. ప్రస్తుతం ‘రాజు యాదవ్’ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించాడు. ఈ చిత్రం మే 17న విడుదల కానుంది. ఇదివరకు విడుదలైన ‘రాజు యాదవ్’ సినిమా ట్రైలర్, పాటలు విడుదలై ప్రేక్షకులలో ఆసక్తిని పెంచాయి.

Also Read: Aravind Kejriwal : కాంగ్రెస్‌కు మద్దతుగా కేజ్రీవాల్ రోడ్ షో.. వాషింగ్ మెషీన్ ప్రచారం

గెటప్ శ్రీను రాజు యాదవ్ లో.. క్రికెట్ ఆడేటప్పుడు ఫేస్ కి బాల్ తగిలి ఫేస్ ఎప్పుడు నవ్వుతూ ఉండిపోయేలా మారితే హీరో ఎలాంటి కష్టాలు ఎదుర్కున్నాడు అనే భిన్న కధాంశంతో సినిమాను రూపొందించారు. ఇకపోతే సినిమా రిలీజ్ సమయంలో ప్రమోషన్స్ చాలా ముఖ్యం. ఇది అందరికి తెలిసిందే. మరీముఖ్యంగా చిన్న సినిమాలకు ప్రమోషన్స్ చాలా ముఖ్యం. ప్రస్తుతకాలంలో సోషల్ మీడియా వేదికగా చిత్రాన్ని ఎంత ప్రచారం చేస్తే సినిమాకు అంత ప్లస్ అవుతుంది. ఇకపోతే., సినిమాని బాగా ప్రమోట్ చేయాల్సిన సమయంలో గెటప్ శ్రీను సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

Also Read: Sandeshkhali : సందేశ్‌ఖలీ కేసులో అప్‌డేట్.. పియాలి దాస్‎కు 8రోజుల జ్యుడిషియల్ కస్టడీ

తాజాగా.. తాను కొద్ది రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటాననిమళ్ళీ కలుద్దాం అంటూ., గెటప్ శ్రీను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తాను హీరోగా సినిమా విడుదలకు కేవలం 3 రోజులే ఉండగా.. ఇప్పుడు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు..? మరోవైపు తెలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు సోషల్ నెట్‌వర్క్‌లకు దూరంగా ఉంటాడడని కొందరు భావిస్తున్నారు. గెటప్ శ్రీను పవన్ కళ్యాణ్ జనసేన తరపున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. మే 13 ఎన్నికల రోజు వరకు పవన్ కోసం సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు. ఇప్పుడు సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత లేదా సినిమా విడుదలైన తర్వాత శ్రీను గెటప్ సోషల్ మీడియాలో కనిపిస్తాడా లేదా అన్నది ఇప్పుడు అర్థంకాని ప్రశ్నగా మారింది.

Exit mobile version