మహిళలు మహారాణులు అని ఊరికే అనలేదు పెద్దలు.. పిల్లలు, వంట పని, ఇంటిపని ఇలా అంతా తానే చూసుకుంటుంది.. ఒక్కరోజు ఆమె పడుకుంది అనుకుంటే ఇక ఇంట్లో అందరు పస్తులే పడుకోవాలి.. అందుకే ఆమె ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటారు.. తన వాళ్ళ కోసం తపన పడే మహిళ తనకంటూ సమయాన్ని కేటాయించుకోకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు గురి అవుతోంది… ఆమె ఆరోగ్యం కోసం గార్మిన్ సంస్థ ఒక ప్రత్యేకమైన స్మార్ట్ వాచ్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ కంపెనీ నుంచి Garmin Lily 2 పేరుతో మార్కెట్లోకి ఒక స్మార్ట్ వాచ్ ను లాంచ్ చేయడానికి సిద్ధమయ్యింది.. ఆ వాచ్ ఫీచర్స్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం…
గార్మిన్ కంపెనీ అదిరిపోయే ఫీచర్స్ తో అదిరిపోయే లుకింగ్ లో స్మార్ట్ వాచ్ ను 2024 లో లిల్లీ 2 స్మార్ట్ వాచ్ ని ప్రకటించింది. ముఖ్యంగా సొగసైన వాచ్ లను ఇష్టపడే వారి కోసం దీనిని మరింత స్టైలిష్ గా తీసుకురావడం జరిగింది. కొత్త మోడల్ లో అసలైన లిల్లీ స్మార్ట్ వాచ్ లో లేని కొన్ని అదనపు ఫీచర్లను జోడించారు
అవి విశ్రాంతి యొక్క నాణ్యతను అలాగే అదనపు వ్యాయామాలను అంచనా వేస్తుంది.. దానికి తగ్గట్లు ఫాలో అయితే చాలు ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు.. ఈ లిల్లీ ధర అనేది ప్రస్తుతం మార్కెట్ లో 250 డాలర్లు ఉంటుందని చెబుతున్నారు.. ఇక ప్రీమియం ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది.. 280 డాలర్లు ఉంటుందని అంచనా..
ఈ వాచ్ నిద్రను క్యాలికులేట్ చేస్తుందట.. నిద్ర దశలలో ఎంత సమయం గడిపారు వంటి అంశాల ఆధారంగా మీ నిద్రను రేట్ చేస్తుంది. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఈ స్లీప్ స్కోర్ మహిళలకు మంచి నిద్రను అందిస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు . ఇకపోతే ఆరోగ్యం, వెల్నెస్ లైనప్ కి పూర్తిగా కొత్త ఫీచర్లను ఈ స్మార్ట్ వాచ్ లో తీసుకురానప్పటికీ కూడా చిన్నపాటి స్టైలిష్ లను ఇష్టపడే వారికి ఇది ఒక సాలిడ్ ఆప్షన్ అని చెబుతున్నారు.. 13 వ్యాయామాలతో పోలిస్తే డాన్స్ ఫిట్నెస్ మోడ్ తో సహా 18 స్పోర్ట్స్ మోడ్ లకు కూడా ఇది మద్దతు ఇస్తుంది.. అలాగే హిప్ హాప్, జుంబా , ఆఫ్రోబీట్ వంటి డాన్స్ మూమెంట్స్ కి ఇది మద్దతు ఇస్తుందని గార్మిన్ తెలిపారు.. పిరియడ్స్ ను కూడా పర్యవేక్షించగలదని నిపుణులు చెబుతున్నారు.. ఇన్ని ఫీచర్స్ ఉన్న ఈ స్మార్ట్ వాచ్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ కూడా ఉంది..
