NTV Telugu Site icon

Gangs Of Godavari : ఫస్ట్ డే కలెక్షన్స్ కుమ్మేసిన విశ్వక్ సేన్ మూవీ..

Viswaksen

Viswaksen

Gangs Of Godavari : మాస్ క దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”.కృష్ణ చైతన్య తెరకెక్కించిన ఈ సినిమాను ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార సంస్థ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్‌ బ్యానర్‌పై నిర్మాత నాగ వంశీ గ్రాండ్ గా నిర్మించారు.ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన నేహాశెట్టి హీరోయిన్ గా నటించింది.క్యూట్ బ్యూటీ అంజలి ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది.ఈ సినిమా మే 31 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.

Read Also :Allu Arjun : 10 కోట్ల ఆఫర్ ను రిజెక్ట్ చేసిన ఐకాన్ స్టార్..?

ఈ సినిమాలో విశ్వక్ సేన్ మాస్ పెర్ఫార్మన్స్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.అలాగే సినిమాను తన అద్భుతమైన టేకింగ్ తో దర్శకుడు కృష్ణ చైతన్య అద్భుతంగా తెరకెక్కించాడు.ఇదిలా ఉంటే ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మొదటి రోజు 8.2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్టు మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు.మొదటి రోజు ఈ సినిమాకు భారీగా కలెక్షన్స్ రావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో ఆసక్తి పెరిగింది.దీనితో మరింతగా కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

Show comments