Site icon NTV Telugu

Cruel Son: రూ.30లక్షలిస్తేనే తండ్రి శవాన్ని ఇంట్లోకి రానిస్తానన్న కొడుకు

Funeral

Funeral

Cruel Son: రోజురోజుకు మానవ సంబంధాలు మనీ సంబంధాలుగా మారిపోతున్నాయి. అందుకు ఈ ఘటన ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. పున్నామనరకం నుంచి తప్పిస్తాడని కొడుకును కని సాకిన తండ్రి ఆశలు అడియాసలయ్యాయి. డబ్బులిస్తేనే అంత్యక్రియలు చేస్తనన్న కొడుకును చూసి స్థానికులు సైతం షాక్ అయ్యారు. కింజుపల్లి కోటయ్య (80) ఆంధ్రప్రదేశ్, ఎన్టీఆర్ జిల్లాకు చెందినవారు. ఆయనకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. ఇద్దరి పెళ్లి తర్వాత కోటయ్య తన కుమారుడితో కలిసి నివాసం ఉంటున్నాడు. కింజుపల్లికి రూ.కోటి విలువైన భూమి ఉంది. ఆస్తి మొత్తం తన పేరు మీద రాయాలని కోటయ్య కుమారుడు కృష్ణ తన తండ్రిని పలుమార్లు కోరాడు. ఒకానొక సమయంలో విసుగు చెంది ఆ భూమిని కోటి రూపాయలకు అమ్మి 70 లక్షలు కొడుకుకు ఇచ్చాడు.

Read Also: Ganjai Seize: చల్లపల్లిలో గుప్పుమన్న గంజాయి.. నలుగురి అరెస్ట్

అలాగే మిగిలిన రూ.30 లక్షలు తన వద్ద ఉంచుకున్నాడు. అయితే ఆ 30 లక్షలు ఇప్పించాలని కొడుకు కోటయ్యతో గొడవపడ్డాడు. కొడుకు తనను తండ్రిని చంపేస్తానని బెదిరించాడని, తండ్రిని కొట్టాడని చాలాసార్లు సన్నిహితులతో చెప్పుకున్నాడు. దీంతో కోటయ్య ఇంటిని వదిలి పక్క గ్రామంలోని కుమార్తె ఇంటికి వెళ్లాడు. అక్కడ కొంతకాలం నివసించిన తరువాత, కోటయ్య అక్కడే మరణించాడు.

Read Also:Jamiat Ulama-i-Hind: భారత్ ముస్లింలకు మొదటి మాతృభూమి.. మోదీ, మోహన్ భగవత్ లాగే మాకు హక్కుంది..

ఈ సమాచారం కోటయ్య కుమారుడికి అందించగా, మృతదేహాన్ని దహన సంస్కారాల నిమిత్తం స్వగ్రామానికి తరలించారు. కానీ అతని కుమారుడు కృష్ణ తన తండ్రి మృతదేహాన్ని ఇంట్లోకి అనుమతించడానికి నిరాకరించాడు.. రూ.30 లక్షలు ఇస్తేనే మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకురానిస్తానని.. తండ్రి మృతదేహానికి అంత్యక్రియలు చేస్తానని చెప్పాడు. ఇది విన్న గ్రామస్తులు షాక్‌కు గురయ్యారు. స్థానికులంతా కృష్ణను ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ అతడు అంగీకరించకపోవడంతో కోటయ్య కుమార్తె తన తండ్రికి అంత్యక్రియలు చేసింది.

Exit mobile version