Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో SIB మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు సిట్ ఎదుట లొంగిపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిట్ ఎదుట హాజరయ్యారు. వారం రోజుల పాటు కస్టోడియల్ విచారణకు సుప్రీంకోర్టు అనుమతించింది. విచారణకు ప్రభాకర్‌రావు సహకరించడం లేదని సిట్ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. ప్రభాకర్‌రావు సెల్‌ఫోన్ పాస్ వర్డ్‌లు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. దశాబ్దాల తరబడి ఉన్న డేటాను ధ్వంసం చేయించారని ఫిర్యాదు చేశారు. ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారన్న విషయాన్ని ప్రభాకర్ దాచి పెట్టారని సిట్ కోర్టుకు వివరించింది. కస్టోడియల్‌లో విచారణలో పూర్తి విషయాలు వెలుగులోకి వస్తాయని.. ముందస్తు బెయిల్ రద్దు చేసి కస్టోడియల్ విచారణకు అనుమతించాలని కోరింది. దీంతో ముందస్తు బెయిల్‌ను సడలించిన సుప్రీంకోర్టు ప్రభాకర్‌రావును కస్టోడియల్ విచారణకు అనుమతించింది.. నేటి నుంచి వారంపాటు ప్రభాకర్‌రావును కస్టోడియల్ విచారణ చేయనున్నారు.
READ MORE: New Nissan MPV: డిసెంబర్ 18న నిస్సాన్ సర్ప్రైజ్- కొత్త MPVతో మార్కెట్‌లోకి రీఎంట్రీ
కాగా.. ఇటీవల సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా జస్టిస్ బీవీ నాగరత్న స్పందిస్తూ.. ‘కోర్టు పిటిషనర్‌కు మధ్యంతర రక్షణ కల్పించడం వల్ల దర్యాప్తునకు సహకరించట్లేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. దీనిపై మీరేమంటారు’ అని ప్రభాకర్‌రావు తరఫున న్యాయవాది రంజిత్‌కుమార్‌ను ప్రశ్నించారు. పిటిషనర్ దర్యాప్తునకు సహకరిస్తున్న విషయాలను వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేసినట్లు ఆయన చెప్పారు. ఆ అఫిడవిట్‌ను మంగళవారం సాయంత్రం 4 గంటలకు దాఖలు చేయడంతో పరిశీలించలేదని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా బుధవారం జరిగిన విచారణ సందర్భంగా చెప్పారు. ఇరువైపులా వాదనల అనంతరం సిట్ అధికారి ఎదుట ప్రభాకర్‌రావు లొంగిపోవాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
READ MORE: Ather Rizta Milestone: ఏథర్ అరుదైన మైలురాయి.. బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ‘రిజ్తా’!
