Nandigam Suresh: టీడీపీ కేంద్ర కార్యాలయం పై జరిగిన దాడిలో ఆరోపణలు ఎదురుకున్న మాజీ ఎంపీ నందిగం సురేష్ పోలీస్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. రెండు రోజులు గుంటూరు జిల్లా జైలులో విచారణ అనంతరం నేడు ఆయన బయటికి రానున్నారు. టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో భాగంగా నందిగం సురేష్‌ను రెండు రోజుల పాటు పోలీసుల విచారణకు న్యాయస్థానం కస్టడీకి పంపింది. ఆయనను విచారణకు సహకరించాలని తెలిపింది. ఇకపోతే దాడి వెనుక ఎవరున్నారనే విషయంపై పోలీసులు విచారణలో నిజానిజాలు తేల్చనున్నారు. ఈ విచారణలో భాగంగా ఎలాంటి లాఠీ చార్జీ చేయడం, దూషించడం, భయపెట్టడం లాంటివి చేయవద్దని కోర్టు తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
kejriwal: నేడే కేజ్రీవాల్ రాజీనామా.. మరి కొత్త సీఎం ఎవరు..?
కోర్టు ఇచ్చిన సమయం ప్రకారం, నేడు మధ్యాహ్నం ఒంటిగంటకు పోలీస్ కస్టడీ ముగియనుంది. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో రెండు రోజులుగా నందిగం సురేష్ ను పోలీసులు విచారించారు. టీడీపీ కేంద్ర కార్యాలయం పై జరిగిన ఈ దాడి, తనకు సంబంధం లేదని, పోలీసులకు మాజీ ఎంపీ నందిగం సురేష్ చెప్పినట్లు సమాచారం. నందిగం సురేష్ స్టేట్మెంట్లను కోర్టు ముందు ఉంచి, మరి కొంతకాలం కస్టడికి కోరే ఆలోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది.