Kakani Goverdhan Reddy : మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి రెండో రోజు విచారణ ముగిసింది. రెవెన్యూ, మైనింగ్ అధికారుల సమక్షంలో రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ కాకానిని విచారించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మైనింగ్ కేసులో కాకాణి పాత్ర గురించి చర్చించినట్టు తెలుస్తోంది. A1, A2, A3లతో ఉన్న సంబంధాలు, లావాదేవీలకు సంబంధించి పోలీసులు 40 ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. రేపటితో కాకాణి కస్టడీ ముగుస్తోంది. ఇప్పుడు ఏపీలో మైనింగ్ కేసు చుట్టూ రాజకీయాలు నడుస్తున్న సంగతి తెలిసిందే.
Read Also : Seediri Appalaraju : పెన్షన్లను తగ్గించిన ఘనత బాబుదే.. సీదిరి అప్పలరాజు కామెంట్స్..
