Site icon NTV Telugu

India-Pak War : దేశంలో మతఘర్షణలు సృష్టించేందుకు పాక్ ప్రయత్నించింది : విక్రమ్ మిస్రీ

Vikram

Vikram

India-Pak War : ఇండియా-పాకిస్థాన్ యుద్ధ పరిస్థితులపై తాజాగా విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషి సంచలన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ.. ‘పాకిస్థాన్ మన దేశ సైనిక స్థావరాలు, నాలుగు ఎయిర్ పోర్టులే లక్ష్యంగా దాడులు చేసింది. మన దేశంలోని గురుద్వారాలపై దాడులు చేసి దేశంలో మత ఘర్షణలు సృష్టించాలని కుట్ర చేసింది. పాక్ ప్రయత్నాలను ఇండియన్ ఆర్మీ బలంగా తిప్పి కొట్టింది. పాక్ వాడిన 400 డ్రోన్లను ఇండియా కూల్చేసింది. పాకిస్థాన్ ప్రపంచాన్ని మోసం చేయాలని చూస్తోంది. మన ప్రార్థనా మందిరాలపై దాడి చేయట్లేదని చెబుతూనే.. ఇక్కడ దాడులు చేయాలని చూస్తోందన్నారు.

Read Also : Uttam Kumar Reddy : అవసరం అయితే బార్డర్ కు వెళ్లి యుద్ధంలో పాల్గొంటా : ఉత్తమ్ కుమార్

‘పాక్ తో సరిహద్దు ఉన్న రాష్ట్రాల్లో దాడులు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఎల్ఓసీ వెంబడి పాకిస్తాన్ భారీ ఆర్టిలరీలతో నిరంతరం కాల్పులు జరుపుతుంది.. లేహ్ నుంచి సర్ క్రిక్ వరకు 36 చోట్ల పాకిస్తాన్ దాడులు చేసింది.. ఇవాళ జరిగే ఐఎంఎఫ్ సమావేశంలో పాకిస్తాన్ కు సహాయం చేయొద్దని కోరతాం. పాకిస్థాన్ పౌర విమానాలను అడ్డు పెట్టుకుని దాడులు చేస్తోంది. అంతర్జాతీయ పౌరుల గురించి ఆలోచించి భారత్ సంయమనం పాటిస్తోంది. త్రివిధ దళాలు పాక్ తో బలంగా పోరాడుతున్నాయి. ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కునేందుకు ఇండియన్ ఆర్మీ సిద్ధంగా ఉంది’ అంటూ విక్రమ్ మిస్రీ వివరించారు.

Read Also : Asim Munir: ‘‘యుద్ధ పిపాసి, జిహదీ జనరల్’’.. పాక్ ఆర్మీ చీఫ్ గురించి కీలక విషయాలు..

Exit mobile version