Honours Degree: యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) రూపొందించిన కొత్త ముసాయిదా నిబంధనల ప్రకారం విద్యార్థులు మూడేళ్లకు బదులుగా నాలుగు సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాతే అండర్ గ్రాడ్యుయేట్ ‘ఆనర్స్’ డిగ్రీని పొందగలరు. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా దేశవ్యాప్తంగా నాలుగేళ్ల డిగ్రీ కోర్సును ప్రవేశపెట్టాలని యూజీసీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ల కోసం పాఠ్యప్రణాళిక, క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్ ముసాయిదా సోమవారం నోటిఫై చేసే అవకాశం ఉంది.
దీనికి సంబంధించిన కొత్త మార్గదర్శకాలను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ విడుదల చేసింది. వీటి ప్రకారం… నాలుగేళ్ల కోర్సు తీసుకునే విద్యార్థులకు మాత్రమే ఆనర్స్ డిగ్రీని ప్రదానం చేస్తారు. విద్యార్థులు అవసరమైతే రీసెర్చ్ స్పెషలైజేషన్‌ను కూడా ఎంచుకునే అవకాశం ఉంది. ఈ విద్యార్థులకు కోర్సు నాలుగో ఏడాదిలో స్పెషలైజేషన్‌కు సంబంధించిన సిలబస్ ఉంటుంది. వీరికి రీసెర్చ్ స్పెషలైజేషన్‌తో ఆనర్స్ డిగ్రీని ప్రదానం చేస్తారు. అదేవిధంగా ఆనర్స్ డిగ్రీని ఎంచుకున్నవారు మొత్తం 160 క్రెడిట్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. మూడేళ్ల డిగ్రీని ఎంచుకునే విద్యార్థులు 120 క్రెడిట్లు పూర్తి చేస్తేనే ఆనర్స్ డిగ్రీని పొందగలుగుతారు. అలాగే ఈ కోర్సుల్లో చేరినవారు ఏదైనా కారణంతో మూడేళ్లలోపు మానేస్తే, మళ్లీ కోర్సులో చేరే అవకాశం ఉంటుంది.
Teachers Transfers: గుడ్ న్యూస్ చెప్పిన సర్కార్.. టీచర్ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్.
ఈ కోర్సుల్లో చేరినవారు ఏదైనా కారణంతో మూడేళ్లలోపు మానేస్తే, మళ్లీ కోర్సులో చేరే అవకాశం ఉంటుంది. వారు మూడేళ్లలోపు నిష్క్రమిస్తే, వారు నిష్క్రమించిన మూడేళ్లలోపు మళ్లీ చేరేందుకు అనుమతించబడతారు. నిర్ణీత ఏడేళ్ల వ్యవధిలో డిగ్రీ పూర్తి చేయాల్సి ఉంటుంది. వీటితోపాటు సబ్జెక్టులకు సంబంధించిన వివరాలను కూడా కమిషన్ వెల్లడించింది. దీన్ని అనుసరించి మేజర్, మైనర్ స్ట్రీమ్ కోర్సులుంటాయి. అలాగే లాంగ్వేజ్ కోర్సులు, స్కిల్ కోర్సులు, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్, అండర్‌స్టాండింగ్ ఇండియా, డిజిటల్ అండ్ టెక్నలాజికల్ సొల్యూషన్స్, హెల్త్ అండ్ వెల్‌నెస్, యోగా ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ అండ్ ఫిట్‌నెస్ కోర్సులు తీసుకునే అవకాశం ఉంది.