NTV Telugu Site icon

Viral Video: బాబోయ్ ఆపండ్రా నాయనా.. ఇలాంటివి చూస్తే జన్మలో తినరు..

food vides

food vides

సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.. అందులో కొన్ని ఫుడ్ వీడియోలు ఎంతగా వైరల్ అవుతాయో నిత్యం మనం చూస్తూనే ఉంటాం.. భోజన ప్రియులను ఆకట్టుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కో వింత ప్రయోగాలు చేస్తారు.. అందులో కొన్ని వీడియోలు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంటాయి.. తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

సాదారణంగా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో అటుకుల తో చేసిన వివిధ వంటకాలు చాలా ఫేమస్. ఆయా ప్రాంతాల్లో కొందరు చిరు వ్యాపారులు ఇదే అటుకుల్లో ఏవోవే కలిపి చిత్రవిచిత్రమైన వంటకాన్ని సిద్ధం చేస్తుంటారు. ఇలాంటి అటుకుల వంటకానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి రాత్రి నానబెట్టిన అటుకులను తీసుకుని, అందులో ముందుగా కాస్త ఉప్పు వేసి మిక్స్ చేస్తాడు. ఆ తర్వాత అందులో పంచదార వేసిన అనంతరం కొన్ని అరటిపండు ముక్కలను జత చేస్తాడు. ఇంతటితో డిష్ రెడీ అయిందనుకుంటే పొరపాటే..

దానిపై రసగుల్లా వేస్తాడు.. ఆ తర్వాత పాలు, ఇంకా పెరుగు వేస్తాడు..ఎదురుచూస్తున్న కస్టమర్ల చేతిలో పెడతాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. నాకు తిండిమీదనే విరక్తి పుడుతోంది’.బాబోయ్ ఆపండ్రా నాయనా.. ఇలాంటివి చూస్తే జన్మలో తినరు.. అంటూ ఇలా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది.. ఆ అద్భుతాన్ని మీరు ఒక లుక్ వేసుకోండి.. ఆలస్యమెందుకు…