Site icon NTV Telugu

Andhra-Telangana: ఉప్పొంగిన కట్టలేరు వాగు.. ఆంధ్ర-తెలంగాణ మధ్య రాకపోకలు బంద్…

Kattaleru

Kattaleru

Andhra-Telangana: అటు ఆంధ్రప్రదేశ్‌, ఇటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసాయి.. దీంతో.. కుంటలు, కాలువలు, నదులు ఉప్పొంగుతున్న సంగతి తెలిసిందే. కొన్ని ప్రాంతాల్లో వరద నీరు రహదారులపైకి చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం దాములూరు దగ్గర కట్టలేరు వాగు పొంగిపొర్లుతోంది.. దీంతో.. రహదారి పైకి భారీగా చేరింది వరద నీరు. దాని ప్రభావంతో.. ఆంధ్ర – తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.. తెలంగాణలో మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు ఆంధ్ర, తెలంగాణ సరిహద్దులో ఉన్న వీరులపాడు మండలానికి రాకపోకలు బంద్ అయ్యాయి.. అసంపూర్తిగా బ్రిడ్జి నిర్మాణం ఉండటం వల్ల ప్రతిసారి వరద వచ్చినప్పుడల్లా రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగి.. రెండు మండలాల ప్రజలు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.. వీలైనంత త్వరగా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. కాగా, వరుసగా కురుస్తున్న వర్షాలు.. కాస్త రిలీప్ ఇచ్చిన విషయం విదితమే.. కొన్ని ప్రాంతాల్లో రాత్రి సమయంలో.. మరికొన్ని ప్రాంతాల్లో పగటిపూట, సాయంత్రం వర్షాలు కుమ్మేస్తున్నాయి.

Read Also: Sanatana Dharma: సనాతన ధర్మం ఒక సామాజిక వ్యాధి.. హెచ్‌ఐవీలాంటిది

Exit mobile version