Site icon NTV Telugu

Poisonous Tea: టీ పొడి అనుకుని పురుగుల మందు.. టీ తాగి ఐదుగురు మృతి

Poisonous Tea

Poisonous Tea

Poisonous Tea: ఓ మహిళ చేసిన పొరపాటు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇంట్లో టీ తాగిన తర్వాత తీవ్ర అస్వస్థతకు గురైన ఇద్దరు చిన్నారులు, వారి తండ్రి సహా ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లా నగ్లా కన్హాయ్‌ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. ఈ మేరకు మెయిన్‌పురి జిల్లా ఎస్పీ కమలేశ్‌ దీక్షిత్‌ వెల్లడించారు. ఆ గ్రామానికి చెందిన రామమూర్తి అనే మహిళ గురువారం తన ఇంట్లో టీ పొడి అనుకున పురుగులమందు డబ్బాలో పౌడర్‌ను వేసి టీ కాచింది. దానిని భర్త శివానందన్‌(35), అతని కుమారులు శివంగ్‌ (6), దివ్యాన్ష్‌ (5), మామ రవీంద్ర సింగ్‌ (55), పొరుగింటి వ్యక్తి సోబ్రాన్‌ (45)లకు ఇచ్చింది. ఉదయం ఇంట్లో టీ తాగిన తర్వాత వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

Bombay High Court: పెళ్లి అయిన మహిళను ఇంటిపనులు చేయమనడం క్రూరత్వం కాదు..

రవీంద్ర సింగ్, శివాంగ్, దివాన్ష్‌ ఆస్పత్రికి తీసుకెళ్లేలోగానే చనిపోగా మిగతా ఇద్దరు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని ఎస్పీ కమలేశ్ దీక్షిత్‌ చెప్పారు. శివానందన్‌ భార్య రామమూర్తి వరి పంటలో పిచికారీ చేసే మందును పొరపాటున టీ పొడి అనుకుని కలిపేసిందని.. అది విషపూరితమై ఈ విషాద ఘటన చోటుచేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు.

Exit mobile version