Hyderabad: ఫిలింనగర్‌లో చిన్నారిపై ట్యూషన్ టీచర్ దాష్టీకం బట్టబయలైంది. ఏడేళ్ల బాలుడిని అట్లకాడతో కాల్చింది. ఓయూ కాలనీకి చెందిన ఒకటవ తరగతి విద్యార్థిపై ఈ దాష్టీకానికి పాల్పడింది. ట్యూషన్ లో చదవడం లేదనే కారణంతో చేతులు, కాళ్ళు, ముఖంపై వాతలు పెట్టింది.. అట్లకాడతో ఆ విద్యార్థి శరీరంపై 8 చోట్ల కాల్చింది ట్యూషన్ టీచర్ శ్రీ మానస.. విద్యార్థికి గాయాలవ్వడంతో తల్లిదండ్రులు ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాలుడిని వైద్య పరీక్షల నిమిత్తం గోల్కొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు ఫిల్మ్ నగర్ పోలీసులు.. తమ కొడుకును విచక్షణ రహితంగా అట్లకాలతో కాల్చిన శ్రీ మానసపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.. ట్యూషన్ టీచర్ మానస పలు చోట్ల కాల్చడంతో ప్రస్తుతం బాలుడు నడవలేకపోతున్నాడు.
READ MORE: Best Budget Projectors: 5 వేలకే 100 అంగుళాల స్క్రీన్.. ఇక థియేటర్‌కు వెళ్లాల్సిన అవసరమే లేదు!
