రాయచోటిలో సినీ నటుడు మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనను నాలుగు గోడల మధ్య తొక్కేయాలని చూశారని.. ప్రేక్షకుల మనసులో నుంచి తనను తీయలేరన్నాడు.. రాయచోటి శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో జగన్నాథ్ మూవీ టీజర్ లాంచింగ్ కార్యక్రమంలో నిర్వహించారు. టీజర్‌ను లాంచింగ్‌కు ముఖ్యఅతిథిగా సినీ నటుడు మంచు మనోజ్ హాజరయ్యాడు. జగన్నాథ్ మూవీ హీరో రాయలసీమ భరత్, హీరోయిన్ ప్రీతి, యూనిట్ బృందంతో కలిసి మూవీ టీజర్ ను లాంచ్ చేశాడు. అభిమానులతో సందడి చేశాడు.
READ MORE: Mrs Movie: Zee5 ఒరిజినల్ చిత్రం ‘మిసెస్’ కు విశేషమైన స్పందన.. గూగుల్‌లో బంఫర్ రేటింగ్
అనంతరం మనోజ్ మాట్లాడుతూ.. చెట్టు పేరు, జాతి పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే వ్యక్తిని కాదన్నాడు. నన్ను తొక్కలన్నా పైకి లేపాలన్న ప్రేక్షకుల చేతుల్లోనే ఉందని.. ఎవరివల్ల సాధ్యం కాదన్నాడు.. నేను న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తా అది బయట వారైనా సరే.. ఇంటివారైనా సరే అని సంచలన వ్యాఖ్యలు చేశాడు.. పరోక్షంగా మంచు విష్ణు, కన్నప్ప సినిమాపై విమర్శలు గుప్పించాడు. “కోటి రూపాయలుతో తీస్తే సినిమా చిన్న సినిమా కాదు.. 1000 కోట్లతో తీస్తే అది పెద్ద సినిమా అయిపోదు.. సినిమా ఎప్పటికీ సినిమానే.. బాగుందా.. బాగాలేదా. సినిమా చాలా గొప్పది.. నేను ఎప్పుడూ సినిమాను నా అమ్మతో పోలుస్తా..” అని వ్యాఖ్యానించాడు.
READ MORE: Off The Record: అనుచరుల దందాలు ఆ టీడీపీ ఎమ్మెల్యేను ఇరుకున పెడుతున్నాయా?