Site icon NTV Telugu

Tennis Star Murder: టెన్నిస్ ప్లేయర్ రాధిక యాదవ్ ను కాల్చి చంపిన తండ్రి.. ఎందుకంటే?

Radhika

Radhika

గురుగ్రామ్‌లోని సెక్టార్ 57 లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర స్థాయి టెన్నిస్ క్రీడాకారిణి రాధిక యాదవ్‌ను ఆమె సొంత తండ్రి కాల్చి చంపారు. సంఘటన సమాచారం అందిన వెంటనే, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెక్టార్ 57లోని ఓ ఇంట్లో రాధిక తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. కాగా ఏవో కారణాలతో కుటుంబంలో వివాదం చెలరేగింది. దీంతో రాధిక తండ్రి ఆగ్రహానికి గురై క్షణికావేశంతో తన కూతురుపై మూడు రౌండ్లు కాల్పులు జరిపారు.

Also Read:Lenovo Yoga Tab Plus: లెనోవా కొత్త ట్యాబ్లెట్ రిలీజ్.. 10,200mAh బ్యాటరీ.. మరెన్నో క్రేజీ ఫీచర్లు

కాల్పుల్లో గాయపడిన 25 ఏళ్ల రాధిక పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కానీ వైద్యులు ఆమెను కాపాడలేకపోయారు. రాధిక యాదవ్ రాష్ట్ర స్థాయిలో ప్రసిద్ధ టెన్నిస్ క్రీడాకారిణి. పలు టోర్నమెంట్స్ లో మెడల్స్ సాధించి కుటుంబానికి ఆ ప్రాంతానికి కీర్తిని తెచ్చిపెట్టింది. ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే గురుగ్రామ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడైన తండ్రిని అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన రివాల్వర్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Exit mobile version