Site icon NTV Telugu

Sangareddy: ఇద్దరు పిల్లలకు ఉరి వేసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి.. కారణం అదే!

Sangareddy

Sangareddy

క్షణికావేశం కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతోంది. కలహాల కారణంగా కుటుంబాలు విచ్ఛిన్మమవుతున్నాయి. జీవితాలు అర్థాంతరంగా ముగిసిపోతున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలకు ఉరి వేసి తాను ఉరివేసుకుని తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఐదు రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఇంటి ఓనర్ కి సమాచారం ఇచ్చారు స్థానికులు. వెంటనే అక్కడికి చేరుకుని డోర్ పగలగొట్టి చూడగా కుళ్లిపోయిన స్థితిలో మృతదేహాలు లభ్యమయ్యాయి.

Also Read:Pahalgam Terror Attack: పహల్గాం మృతుడి భార్యపై ట్రోలింగ్.. తీవ్రంగా మండిపడిన మహిళా కమిషన్

భార్య మంజుల(35) కి వేరొకరితో వివాహేతర సంబంధం ఉన్నట్టు సమాచారం. ఈ కారణంతో గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని టాక్. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో పిల్లలతో కలిసి సుభాష్(40) ఉంటున్నాడు. మానసిక వేదనకు గురైన సుభాష్ చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. కుమారుడు రిథిక్ మర్యాన్(09), కుమార్తె ఆరాధ్య(05)కి ఉరివేసి…అనంతరం ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డు సుభాష్. ముగ్గురి మరణంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Also Read:PM Modi Review: భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలు.. ప్రధాని మోడీతో రక్షణశాఖ కార్యదర్శి కీలక భేటీ

ఘటన స్థలంలో మృతుడు సుభాష్ రాసిన 4 పేజీల సూసైడ్ నోట్ లభ్యమైంది. తన భార్య ప్రవర్తన వల్లే పిల్లలతో సహా చనిపోతున్నానని సుభాష్ సూసైడ్ నోట్ రాశారు. తన భార్యకి డబ్బుల ఆశచూపి శారీరకంగా వాడుకున్నారని లేఖలో పేర్కొన్నాడు. భార్య మంజులకు ఎన్నిసార్లు చెప్పిన ప్రవర్తనలో మార్పూరకపోవడంతో గొడవలు జరిగాయని చెప్పాడు. నాలుగు పేజీల సూసైడ్ నోట్ లో తన భార్య వివాహేతర సంబంధాల గురించి ఒక్కొక్కటిగా వివరించాడు సుభాష్.

Exit mobile version