ప్రేమ పెళ్లిల్లు విషాదంగా మారుతున్నాయి. పెద్దలకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడంతో పేరెంట్స్ ఆగ్రహానికి గురవుతున్నారు. కొందరు తల్లిదండ్రులు కన్న బిడ్డలను చంపేందుకు కూడా వెనకాడడం లేదు. తాజాగా కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. కూతురు కూలాంతర వివాహం చేసుకుందని గర్భణీ అని చూడకుండా తండ్రి కొట్టి చంపాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కర్ణాటకలోని హుబ్బళ్లిలో కుటుంబం నుంచి తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ వేరే కులానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్నందుకు 19 ఏళ్ల గర్భిణీ స్త్రీని ఆమె తండ్రి హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. మాన్య పాటిల్ అనే ఆ యువతి ప్రాణాలకు ముప్పు ఉందని భయపడి తల్లిదండ్రులకు దూరంగా నివసిస్తూ ఇటీవలే తన స్వగ్రామానికి తిరిగి వచ్చింది.
Also Read:Engineers Corruption: చిత్తూరు జిల్లాలో ఆర్ అండ్ బీ ఇంజనీర్ల అవినీతి బాగోతం..
ఆదివారం సాయంత్రం జరిగిన ఈ సంఘటనలో పోలీసులు ముగ్గురు అనుమానితులను – మాన్య తండ్రి ప్రకాష్ ఫక్కిర్‌గోడా, ఇద్దరు దగ్గరి బంధువులను – అదుపులోకి తీసుకున్నారు. మాన్య అనే యువతి ఈ ఏడాది మే నెలలో తన తల్లిదండ్రులను ఎదిరించి వేరే కులానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంది. తమ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని భయపడి, ఆ జంట హుబ్బళ్లిలోని తన స్వగ్రామం నుండి 100 కి.మీ దూరంలో ఉన్న హవేరి జిల్లాలో నివసిస్తున్నారు. ఇటీవలె తిరిగొచ్చిన వారిపై యువతి కుటుంబ సభ్యులు దాడికి యత్నించగా తప్పించుకున్నట్లు తెలిసింది.
Also Read:Shambhala : నాన్న టెన్షన్ తగ్గాలంటే ఆ హిట్ పడాల్సిందే.. ఆది ఎమోషనల్ స్పీచ్
తరువాత, సాయంత్రం ఇనుప రాడ్ లతో బాధితురాలి ఇంట్లోకి చొరబడి దాడి చేశారు. ఈ దాడిలో ఆరు నెలల గర్భవతి అయిన మాన్య తీవ్రంగా గాయపడింది. ఆమె అత్తమామలు రేణుకమ్మ, సుభాష్ ఆమెను రక్షించడానికి ప్రయత్నించినప్పుడు, వారిపై కూడా దారుణంగా దాడి చేశారు. మాన్య అత్తమామలకు తీవ్ర గాయాలు కాగా, వీరిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మాన్య ప్రాణాలు కోల్పోయింది. ఘటనపై కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
