జాతి రత్నాలు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో మెరిసింది.. కానీ హీరోయిన్ గా గుర్తింపు రాలేదు.. ఇకపోతే సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. తాజాగా ట్రెడిషనల్ లుక్ ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
ప్రొఫెషనల్ డాన్సర్. మంచి యాక్టింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయి. బ్రేక్ మాత్రం రావడం లేదు. కనీసం టైర్ టూ హీరోలు కూడా తమ చిత్రాల్లో తీసుకోవడం లేదు. ఫరియా హైదరాబాద్ కి చెందిన అమ్మాయి కావడం మరో విశేషం. ఆమె కెరీర్ ఒడిదుడుకులతో సాగుతుంది.. హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోలేదు.. ఫరియాకు దర్శకుడు అనుదీప్ హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన జాతిరత్నాలు చిత్రంతో ఫరియా సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది.. ఆ సినిమా బాక్సఫీస్ వద్ద మంచి టాక్ ను అందుకుంది.. ఆ తర్వాత ఈ అమ్మాయి బిజీ అవుతుందని అనుకున్నారు.. కానీ పెద్ద సినిమా అవకాశాలు అమ్మడు తలుపు తట్టలేదు..
జాతిరత్నాలు ఫరియాను ఓవర్ నైట్ స్టార్ చేసిందని చెప్పొచ్చు. అయితే ఆ మూవీ విజయం సాధించిన స్థాయిలో ఆఫర్స్ అయితే రావడం లేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీలో ఫరియా చిన్న క్యామియో రోల్ చేశారు. హీరో పెళ్లి చూపులు చూడటానికి వచ్చిన అమ్మాయి పాత్రలో తళుక్కున మెరిశారు. అనంతరం బంగార్రాజు మూవీలో ఐటెం సాంగ్ చేశారు. సంతోష్ శోభన్ కి జంటగా నటించిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ కనీస ఆదరణ దక్కించుకోలేదు.. కేరీర్ ఎలా ఉన్నా కూడా ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ హైపర్ యాక్టివ్ గా ఉంటుంది..ఇంస్టాగ్రామ్ లో వీడియోలు, ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు. ఫరియా డాన్స్ వీడియోలకు భలే డిమాండ్ ఉంది.. తాజాగా ట్రెడిషనల్ లుక్ లో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది.. ఆ ఫోటోలు క్షణాల్లో వైరల్ అయ్యాయి.. ఇక సినిమాల విషయానికొస్తే.. ఒకటో, రెండో చేస్తుంది..