జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా గురించి అందరికీ తెలుసు..ఒక్క సినిమాతోనే యూత్ మనసు దోచుకొని ఓవర్ నైట్ హీరోయిన్ అయ్యింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసింది కానీ పెద్దగా ఆ సినిమాలు ఆమెకు పేరును ఇవ్వలేక పోయాయి.. ఐటమ్ సాంగ్ లో కూడా మెరిసింది.. ప్రస్తుతం అల్లరి నరేశ్ సరసన ఓ సినిమా చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఫరియా లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. తాజాగా తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది..
ఈ అమ్మడు జాతి రత్నాలు సినిమా తర్వాత బంగర్రాజు, రావణసుర, లైక్ షేక్ సబ్ స్క్రైబ్ వంటి చిత్రాలతో అలరించింది. ఇటీవల తెలుగు సినిమాల్లో కనిపించలేదు.. కానీ ప్రస్తుతం తమిళంలో సినిమాలు చేస్తోంది.. తెలుగులో అల్లరి నరేష్ సరసన ఆ ఒక్కటి అడక్కు సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది.. ఈ సినిమా మేలోనే విడుదల కాబోతుంది.. ఈ సందర్బంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటు సందడి చేస్తుంది..
ఇదిలా ఉండగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.. నేను చాలా హైట్ ఉంటాను కదా నా హైట్ కు మ్యాచ్ అయ్యేలా ఉండే అబ్బాయి కావలి.. అంతకన్నా ముందు తనను అర్థం చేసుకుంటూ ఎప్పుడు సరదాగా ఉండే అబ్బాయి అయితే బాగుంటుందని ఫరియా చెప్పుకొచ్చింది.. ప్రస్తుతం ఈ వాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
