Site icon NTV Telugu

Family Star : ఫ్యామిలీ స్టార్ కి అల్టిమేట్ పాజిటివ్ టాక్.. బ్రహ్మరథం పడుతున్న ఓటీటీ ఆడియన్స్

Family Star (2)

Family Star (2)

రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ “ఫ్యామిలీ స్టార్”.స్టార్ డైరెక్టర్ పరశురామ్ డైరెక్షన్ లో ఈ మూవీ తెరకెక్కింది.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మించారు.ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హెరాయిన్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది.గతంలో గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ మూవీ ఇచ్చిన కాంబినేషన్ మరోసారి రిపీట్ కావడంతో ఫ్యామిలీ స్టార్ మూవీపై ప్రేక్షకులలో అంచనాలు భారీగా పెరిగాయి .ఈ సినిమా ఏప్రిల్ 5 న ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయింది .అయితే విడుదల అయిన మొదటి షో నుండే ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది.అంతే కాదు ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ పై నెటిజన్స్ విపరీతంగా ట్రోల్ చేసారు.దీనితో ఈ సినిమా కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడింది.దీనితో ఈ సినిమా థియేటర్స్ లో విడుదల అయిన 20 రోజులలోనే ఓటిటిలోకి వచ్చింది.

అయితే రీసెంట్ గా అమోజాన్ ప్రైమ్ వీడియోలోకి స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నామంటూ పలువురు నెటిజన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్నారు. థియేటర్స్ లో ఆకట్టుకోని ఈ సినిమా ఓటిటిలో అదరగొడుతుంది .ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ సమయంలో సినిమా మీద కొందరు నెగిటివ్ ప్రచారం చేయడంతో సినిమాను థియేటర్ లో చూడలేదని, ఇప్పుడు ప్రైమ్ వీడియోలో సినిమాను ఎంజాయ్ చేస్తున్నామంటూ కొందరు నెటిజన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.ఈ సినిమాలో విజయ్, మృణాల్ ఫర్ఫార్మెన్స్ బాగుందని, హీరో తన ఫ్యామిలీ కోసం నిలబడటం ఇన్ స్పైరింగ్ గా ఉందంటూ వారు పోస్ట్స్ చేస్తున్నారు.కొందరు కావాలని ఈ సినిమాపై నెగటివ్ ప్రచారం చేసారు. విజయ్ కు వున్న క్రేజ్ కారణముగా ఫ్యామిలీ స్టార్ సినిమా మాస్ మరియు ఫ్యామిలీ ప్రేక్షకులకు రీచ్ అయ్యింది. ఓటీటీ రిలీజ్ తో సినిమాపై వున్న నెగటివ్ ప్రచారం అంతా తేలిపోయింది.ఈ సినిమాను ఇండియాలోనే కాదు అమెరికాలో కూడా ప్రైమ్ వీడియోలో చూస్తున్నప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీ ఓటిటిలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది .

Exit mobile version