Site icon NTV Telugu

Fake Apple Products: హైదరాబాద్ లో నకిలీ యాపిల్ ఉత్పత్తుల స్కాం.. రూ.3 కోట్ల విలువైన యాపిల్ యాక్సెసరీస్ స్వాధీనం

Fake Apple Products

Fake Apple Products

హైదరాబాద్ లో నకిలీ యాపిల్ ఉత్పత్తుల స్కాం బట్టబయలైంది. మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించారు. రూ.3 కోట్ల విలువైన యాపిల్ యాక్సెసరీస్ స్వాధీనం చేసుకున్నారు. షాహిద్ అలీ, ఇర్ఫాన్ అలీ, సంతోష్ రాజ్‌పురోహిత్ లు ముగ్గురని అరెస్ట్ చేశారు. ముంబైలోని ఏజెంట్ల నుంచి డూప్లికేట్ యాపిల్ గాడ్జెట్లు కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు. యాపిల్ లోగో, స్టిక్కర్లు, సీల్‌లతో నకిలీ ప్యాకేజింగ్ చేసి అసలైనవిగా నమ్మించి కస్టమర్లను మోసం చేస్తున్నట్లు గుర్తించారు. యాపిల్ వాచ్‌లు, ఎయిర్‌పాడ్స్, పవర్‌బ్యాంకులు, కేబుల్స్ స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 2,761 నకిలీ ఉత్పత్తులు సీజ్ చేశారు.

Exit mobile version