Extra Ordinary Man : సెకండ్ సింగిల్ రిలీజ్ పై అప్డేట్ ఇచ్చిన మేకర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్.. ఈ చిత్రాన్ని వక్కంతం వంశీ డైరెక్ట్ చేస్తున్నాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి డేంజర్ పిల్లా పాటను విడుదల చేయగా చాట్ బస్టర్ గా నిలిచింది..తాజాగా సెకండ్ సింగిల్ పై అప్‌డేట్ ను అందించారు మేకర్స్. బ్రష్ వేసుకో అంటూ సాగే రెండో పాటను నవంబర్ 10న విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు.రీసెంట్ గా ఈ చిత్రం టీజర్ రిలీజ్ అయింది..ఈ చిత్రం లో నితిన్ స్టైలిష్ లుక్‌లో డిఫరెంట్ షేడ్స్‌లో కనిపిస్తున్నాడు. అరే నువ్వొక జూనియర్ ఆర్టిస్ట్‌వి.. అంటే ఎక్స్‌ట్రాగాడివి.. ఒక ఆర్డినరీగాడికి ఎందుకురా ఇన్ని ఎక్స్‌ట్రాలు.. అంటూ టీజర్‌లో కొడుకు క్యారెక్టరైజేషన్ గురించి రావు రమేశ్ చెప్తున్న డైలాగ్స్ ఎంతగానో ఆకట్టుకుంటూ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతున్నాయి.
ఈ చిత్రాన్ని నితిన్ హోం బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్‌పై సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యాంగ్రీ యంగ్ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. నితిన్ అండ్ టీం ఇటీవలే రాజశేఖర్ కు వెల్‌కమ్ చెబుతూ వీడియోను కూడా షేర్ చేయగా నెట్టింట తెగ వైరల్ అవుతుంది..ఈ చిత్రంలో నితిన్ స్మగ్లర్‌గా కనిపించనున్నట్టు సమాచారం. ఈ మూవీని డిసెంబర్ 8న విడుదల చేస్తున్నట్టు తెలియజేస్తూ లాంఛ్ చేసిన పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుంది.. ఇదిలా ఉంటే నితిన్ మరోవైపు వెంకీ కుడుముల డైరెక్షన్‌లో VNRTrio (వర్కింగ్ టైటిల్)లో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. భీష్మ తర్వాత నితిన్, వెంకీ కుడుముల కాంబోలో వస్తున్న సినిమా కావడంతో సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పై నవీన్ యేర్నేని, వై రవి శంకర్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..