NTV Telugu Site icon

Large Explosion : అమెరికాలోని పెంటగావ్ సమీపంలో భారీ పేలుడు

New Project (7)

New Project (7)

Large Explosion : అమెరికాలోని పెంటగాన్ సమీపంలో భారీ పేలుడు చోటు చేసుకుంది. దీంతో పెద్ద ఎత్తున పొగ వ్యాపించింది. వాషింగ్టన్ డీసీ లోని పెంట‌గావ్ కాంప్లెక్స్ స‌మీపంలో పేలుడు సంభ‌వించ‌డంతో అక్కడ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పేలుడు అనంత‌రం భారీగా పొగ‌లు క‌మ్ముకున్నాయి. దట్టమైన పొగ‌లు పూర్తి స్థాయిలో వ్యాపించాయి. దీంతో అక్కడ ఏమీ క‌నిపించ‌కుండా పోయింది. విష‌యం తెలుసుకున్న ప్రభుత్వ అధికారులు సంఘ‌ట‌నా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించారు.

పెంట‌గాన్‌లో పేలుడు అంటూ వ‌స్తున్న వార్తలను కొంద‌రు ఖండిస్తున్నారు. సోష‌ల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న ఫోటోలు అన్నీ క‌ల్పితాలేన‌ని చెబుతున్నారు. ఆర్టిపీషియ‌ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత ఫోటోల‌ని వాటిని కొట్టిపారేస్తున్నారు. మ‌రోవైపు అమెరికాలోని అధికారులు ఈ విష‌యంలో ఇప్పటి వ‌ర‌కు స్పందించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.