Site icon NTV Telugu

Gandhi Hospital: గాంధీలో కాలం చెల్లిన వ్యాక్సిన్స్.. హెచ్‌ఆర్సీ ఆగ్రహం..

Gandhi Hospital Hyderabad

Gandhi Hospital Hyderabad

హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో గడువు ముగిసిన హెపటైటిస్-బి వ్యాక్సిన్‌లను నిర్లక్ష్యంగా ఇవ్వడం పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ బాధితుడు హెచ్‌ఆర్సీని ఆశ్రయించాడు.. ఇదే అంశం పై గతంలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటో కేసు సైతం నమోదు చేసింది.. ఈ తాజా అంశంపై విచారించిన హెచ్‌ఆర్సీ .. బాధితుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహించడం సరికాదని అసహనం వ్యక్తం చేసింది. ఆసుపత్రి సూపరిండెంట్‌తో పాటు బాధ్యులైన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. ఈ అంశంలో ఎక్స్పైరీ వ్యాక్సిన్ ఇచ్చిన ప్రతి బాధితునికి రూ.1,25,000/- చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశించింది. మందుల సేకరణ.. నిర్వహణ ప్రక్రియలో తగిన జాగ్రత్తలు.. చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి కమిషన్ సూచించింది. ఈ సిఫార్సులు రెండు నెలల్లోపు అమలు చేయాలని కమిషన్ ఆదేశించింది.

Exit mobile version