Site icon NTV Telugu

Ex Russian Minister Arrest: డెహ్రాడూన్ ఎయిర్‌పోర్టులో రష్యా మాజీ మంత్రి అరెస్ట్.. ఎందుకంటే?

Former Russian Minister

Former Russian Minister

Ex Russian Minister Arrest: సరైన పత్రాలు లేకుండా శాటిలైట్ ఫోన్‌ను తీసుకెళ్లినందుకు రష్యా మాజీ మంత్రిని డెహ్రాడూన్ విమానాశ్రయంలో ఆదివారం సాయంత్రం అరెస్టు చేసినట్లు అధికారి ఒకరు తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా విమానాశ్రయాలు, విమానాలలో శాటిలైట్ ఫోన్‌లు అనుమతించబడవు.

NIA Raids: గ్యాంగ్‌స్టర్లు, ఉగ్రవాద ముఠాలకు లింక్‌.. దేశవ్యాప్తంగా ఎన్‌ఐఏ దాడులు

64 ఏళ్ల వయస్సు గల విక్టర్ సెమెనోవ్ 1998 నుంచి 1999 వరకు రష్యా వ్యవసాయం, ఆహార మంత్రిగా ఉన్నారు. సాయంత్రం 4:20 గంటలకు భద్రతా తనిఖీ సమయంలో విమానాశ్రయాలను కాపాడే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. మాస్కోలో నివసిస్తున్న సెమెనోవ్ ఇండిగో విమానంలో ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. ఆయన పరికరాన్ని కలిగి ఉన్నందుకు చెల్లుబాటు అయ్యే పత్రాలు ఏవీ సమర్పించలేకపోయాడు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ (ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్) ప్రకారం, అత్యవసర సమయంలో వ్యక్తిగత ఉపయోగం కోసం శాటిలైట్ ఫోన్‌ను తీసుకెళ్లినట్లు రష్యా మాజీ మంత్రి చెప్పారు.

Exit mobile version