NTV Telugu Site icon

Uttarakhand: గురుద్వారా చీఫ్ హత్య కేసులో మాజీ ఐఏఎస్ పాత్ర! ఏం తేలిందంటే..!

Gurudvar

Gurudvar

ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్ నగర్ జిల్లాలోని నానక్‌మట్టా గురుద్వారాకు చెందిన కరసేవా చీఫ్ బాబా తార్సేమ్ సింగ్ హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గురుద్వారా నిర్వహణ కమిటీకి నేతృత్వం వహిస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారిపై కూడా కేసు నమోదు చేశారు. గురువారం ఉదయం గురుద్వారా ప్రాంగణంలో తార్సేమ్ సింగ్‌ను బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కాల్చి చంపారు.

గురువారం ఉదయం 6:30 గంటల సమయంలో గురుద్వారా ప్రాంగణంలో తర్సేమ్ సింగ్‌ కుర్చీపై కూర్చుని ఉండగా ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. బైక్‌పై లోపలికి ఎంట్రీ ఇచ్చిన దుండగులు.. వచ్చిరాగానే కాల్పులకు తెగబడడంతో అక్కడికక్కడే తర్సేమ్ సింగ్‌ కుప్పకూలిపోయాడు. అనంతరం అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తులు హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. అయినా కూడా అతని ప్రాణాలు నిలువలేదు. మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. ఈ ఆలయం ధమ్ సింగ్ నగర్ జిల్లాలో రుద్రపూర్-తనక్‌పూర్ మార్గంలోని సిక్కుల పుణ్యక్షేత్రంగా ఉంది.

ఈ ఘటన తర్వాత పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెప్పారు. మొత్తానికి మూడు రోజుల దర్యాప్త అనంతరం ఐదుగురిపై కేసులు నమోదు చేశారు.

 

ఇది కూడా చదవండి: Tejaswini Gowda: కర్ణాటకలో బీజేపీకి షాక్.. కాంగ్రెస్‌లోకి కీలక నేత..

Show comments