రష్యాకు డ్రోన్లను సరఫరా చేసినందుకు ఇరాన్ రక్షణ మంత్రి మహ్మద్ రెజా అష్టియాని సహా తొమ్మిది సంస్థలపై ఆంక్షలు విధించేందుకు యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాల ప్రభుత్వాలు అంగీకరించాయి. ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా ఇరాన్ నుంచి పొందిన డ్రోన్‌లను ఉపయోగిస్తోంది. ఈయూ ప్రభుత్వాల రాయబారుల మధ్య ‘కోరిపార్’ ఒప్పందం సోమవారం జరిగే అవకాశం ఉంది. యూరోపియన్ యూనియన్ విదేశాంగ మంత్రుల సమావేశంలో ఆమోదించబడిన తర్వాత ఇరాన్ రక్షణ మంత్రి సహా తొమ్మిది కంపెనీలను బహిరంగపరచబడుతుంది అని ఈయూ దౌత్యవేత్త ఒకరు తెలిపారు.
Read Also: Saturday Parayanam: శనివారం ఈ స్తోత్ర పారాయణం చేస్తే బాధల నుంచి విముక్తులవుతారు..
కాగా, ఇరాన్‌కు చెందిన మానవరహిత వైమానిక వాహనాలను (UAV) తయారు చేసే తొమ్మిది సంస్థలు ఈ ఒప్పందంలో చేర్చబడ్డాయని యూరోపియన్ యూనియన్ దౌత్యవేత పేర్కొన్నారు. దీంతో పాటు ఇరాన్ రక్షణ మంత్రి మహ్మద్ రెజా అస్తియాని కూడా ఈ ఆంక్షల జాబితాలో చేర్చబడ్డారు అని చెప్పుకొచ్చారు. ఇందులో వ్యక్తుల ప్రయాణాలపై పరిమితులు, సంస్థల ఆస్తుల జప్తుకు సంబంధించిన జాబితా రెడీ చేయబడటంతో పాటు సంస్థలకు ఆర్థిక వనరులను అందించడంలో పరిమితులు విధించబోతునట్లు వెల్లడించారు.
