దేశప్రధాని నరేంద్రమోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వంలో గ్రామ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వీరి నాయకత్వంలో ఏవిధంగా ముందుకు తీసుకు వెళ్తున్నామో యోజన పత్రిక వివరించిందన్నారు మంత్రి. కేసీఆర్ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. పల్లె ప్రగతి వల్ల గ్రామాలు బాగుపడ్డాయి. ఇది దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు.
కేసీఆర్ ఒక ప్రణాళిక ప్రకారం రాష్టాన్ని అభివృద్ధి చేస్తున్నారు. తెలంగాణలో ఒకప్పుడు గంగదేవిపల్లి ఆదర్శ గ్రామంగా ఉండేది. ఇప్పుడు అనేక గ్రామాలు ఆదర్శ గ్రామాలు అయ్యాయి. పల్లె ప్రకృతి వనాలు, ఒక్కో గ్రామానికి ట్రాక్టర్, ఇతర వసతులు కల్పించారు. తెలంగాణకు హరిత హారం వంటి కార్యక్రమాల ద్వారా పల్లెల రూపురేఖలు, పర్యావరణం మెరుగుపడిందన్నారు.
