Epione Hospital: ప్లాస్మా తెరఫీ చికిత్స పద్ధతిలో 20వేల మోకాలి చికిత్సలను విజయవంతంగా పూర్తి చేసినట్లు ప్రముఖ కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ సుధీర్ ధారా తెలిపారు. జూబ్లీహిల్స్ ఇపియోన్ ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో దీనికి సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న వారికి ఎలాంటి ఆపరేషన్ లేకుండా ప్లాస్మా తెరఫీ విధానంలో నాణ్యమైన చికిత్సలు అందిస్తున్నట్లు చెప్పారు. దేశంలోనే మొదటిసారిగా ఈ చికిత్స పద్ధతిని అందుబాటులోకి తెచ్చిన తమ ఆసుపత్రి నేటితో 20 వేల చికిత్సలను విజయవంతంగా పూర్తి చేసిందని అన్నారు. ఇక, మోకాలి నొప్పులతో బాధపడుతున్న వారి నుంచి సేకరించిన ప్లాస్మాను సోనో సైట్ యంత్రాన్ని ఉపయోగించి చికిత్సలు అందిస్తున్నట్లు తెలిపారు ఇపియోన్ ఆస్పత్రి వ్యవస్థాపకులు డాక్టర్ సుధీర్ ధారా.
Read Also: Election Commission Of India:ఆర్నెళ్ల ముందుగా ఎన్నికలు నిర్వహించేందుకు రాజ్యాంగం అనుమతిస్తోంది
మరోవైపు ఈ సందర్భంగా చికిత్స పొందినవారి మాట్లాడుతూ.. చికిత్స తర్వాత తమ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో వెల్లడించారు. గతంలో ఎయిర్ ఇండియా లో పనిచేశాను. గత పదివేలుగా తీవ్రమైన మోకాలు నొప్పితో బాధపడుతూ డాక్టర్ సునీల్ ధారాను కలిశాను. ఆధునిక చికిత్స పద్ధతి అయిన ప్లాస్మా థెరపీతో అందించారు. ఏడాది క్రితం చికిత్స పూర్తి అయింది. గతంలో నడవడం కష్టంగా ఉండేది ప్రస్తుతం సులువుగా నడవగలుగుతున్నాను. ఆపరేషన్ లేకుండా నిర్వహించిన చికిత్స అద్భుతం. ఈ విధానంలో చికిత్స పూర్తి చేసుకున్న మరుసటిరోజే సులువుగా నడవగలిగామని గంగా భవాని, భారతి అనే మహిళలు తెలిపారు.