Site icon NTV Telugu

ENG vs IND: గెలిచారు.. గెలిచారు.. భారత్ ప్రతీకార విజయం!

Eng Vs Ind

Eng Vs Ind

ENG vs IND: ది ఓవల్‌ వేదికగా జరిగిన ఐదో టెస్టులో భారత్ అద్భుత విజయం సాధించింది. విజయం చివరి వరకు అటువైపా.. ఇటువైపా.. అంటూ ఊగిసలాడగా విజయం చివరకు భారత్ ను వరించింది. దీనితో ఈ సిరీస్ 2-2తో సమంగా ముగిసింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ బ్యాటర్లను భారత బౌలర్లు మహ్మద్ సిరాజ్ 5 వికెట్లు, ప్రసిద్ధ్ కృష్ణ 4 వికెట్లు తియడంతో ఇంగ్లండ్‌ కు విజయాన్ని దూరం చేశారు. మొత్తంగా చివిరి టెస్టులో ఉత్కంఠభరితంగా సాగి చివరకు 6 పరుగుల తేడాతో గెలిచి, సిరీస్ ను సమం చేసింది.

Vivo Y400 5G: వివో నుంచి వివో Y400 5G మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్.. ప్రీమియం ఫీచర్లు

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్‌ తన మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 224 పరుగులు చేయగలిగింది. కరుణ్ నాయర్ (57) మినహా మిగిలిన బ్యాటర్లు సరైనగా నిలదొక్కుకోలేకపోయారు. ఇంగ్లాండ్ బౌలర్లలో గస్ అట్కిన్సన్ 5 వికెట్లు పడగొట్టి భారత్‌ను దెబ్బతీశాడు. ఇక మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్‌ జట్టు 247 పరుగులు చేసి 23 పరుగుల ఆధిక్యంలోకి వెళ్లింది. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణలు చెరో 4 వికెట్లు తీయడంతో ఇంగ్లండ్‌ భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నారు.

IND vs ENG: టెన్షన్.. టెన్షన్.. మ్యాచ్ ఎటువైపు? 20 పరుగులు.. 2 వికెట్లు?

ఇక భారత రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ (118) ధాటిగా ఆడి శతకాన్ని నమోదు చేశాడు. అలాగే అకాశ్ దీప్ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్ సుందర్ (53) లు కీలక పాత్ర పోషించారు. దీంతో భారత్‌ 396 పరుగులు చేసి ఇంగ్లాండ్‌ ముందు 374 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఇక ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో జో రూట్ (105), హ్యారీ బ్రూక్ (111)లు శతకాలతో పోరాడారు. కానీ చివర్లో సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణలు వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను 367 పరుగులకే ఆలౌట్ చేశారు. దీనితో చివరికి కేవలం 6 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది.

Exit mobile version