Site icon NTV Telugu

Lok Sabha Elections: బెంగాల్ గవర్నర్‌కు ఈసీ షాక్.. తాజా ఆదేశాలు ఇవే

Gover

Gover

పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్‌‌కు కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఏప్రిల్ 18-19 తేదీల్లో కూచ్ బెహార్‌లో పర్యటనకు బ్రేక్ వేసింది. తొలి విడత ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 19న ప్రారంభం కానుంది. అయితే అదే రోజు కూచ్‌బెహార్‌లో పోలింగ్ జరుగుతోంది. ఇక బుధవారం ఎన్నికల ప్రచారం కూడా ముగిసింది. తాజాగా గవర్నర్ సీవీ ఆనంద బోస్.. అదే నియోజకవర్గంలో పర్యటనకు పెట్టుకున్నారు. అందుకు ఎన్నికల సంఘం అంగీకరించలేదు. గవర్నర్ పర్యటనను రద్దు చేసింది. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: Jammu Kashmir: టెర్రరిస్టుల దుశ్చర్య.. బీహార్ వలస కూలీ కాల్చివేత

కూచ్ బెహర్‌లో శుక్రవారమే పోలింగ్ జరుగుతోంది. 48 గంటల సైలెంట్ పీరియడ్ బుధవారం సాయంత్రం నుంచి అమల్లోకి వచ్చింది. ఈనెల 18, 19 తేదీల్లో కూచ్‌బెహర్‌లో గవర్నర్ పర్యటించనున్నారనే సమాచారం తమకు అందిందని, 19న ఎన్నికలు ఉండటంతో సైలెంట్ పీరియడ్ అమల్లోకి వచ్చిందని ఎన్నికల కమిషన్ తెలిపింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రతిపాదిత పర్యటనను గవర్నర్ చేపట్టరాదని తెలిపింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం, గవర్నర్ ఎలాంటి లోకల్ ప్రోగ్రామ్స్ నిర్వహించరాదని గవర్నర్ కార్యాలయానికి పంపిన సమాచారంలో ఈసీ స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: Kejriwal: కేజ్రీవాల్ పర్సనల్ సెక్రటరీకి మరో షాక్.. తాజా ఆదేశాలు ఇవే

ఏప్రిల్ 18, 19 తేదీల్లో మొత్తం జిల్లా యంత్రాంగం, పోలీసు సిబ్బంది ఎన్నికల విధుల్లోనే ఉంటారని తెలిపింది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 126 ప్రకారం కూచ్ బెహర్‌లో సైలెన్స్ పీరియడ్ బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. తొలి విడత ఏప్రిల్ 19న ప్రారంభం అవుతోంది. సెకండ్ విడత ఏప్రిల్ 26న జరగనుంది. అటు తర్వాత మే 7, 13, 20, 25, జూన్ 1న జరగనుంది. ఇక ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదలకానున్నాయి.

Exit mobile version