Site icon NTV Telugu

Exit Polls: జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్పై నిషేదం: ఈసీ

Ec

Ec

కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటనను రిలీజ్ చేసింది. లోక్‌సభ ఎన్నికలు 2024లో ప్రారంభ దశ ఏప్రిల్ 19 ఉదయం 7 గంటల నుంచి ఏడవ దశ పోలింగ్ జరగాల్సిన జూన్ 1వ తేదీ సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడానికి వీల్లేదని తెలిపింది. లోక్‌సభతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ, ఉప ఎన్నికలకు ఓటింగ్ పూర్తయ్యే వరకు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించడంతో పాటు ప్రకటించడం నిషేదం అని ఈసీ హెచ్చరికలతో కూడిన నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం పోలింగ్ సమయంలో ఒపీనియన్ పోల్, పోల్ సర్వే ఫలితాలను ప్రకటించడం నిషేదం అని వార్నింగ్ ఇచ్చింది.

Read Also: Maharastra : పెళ్లాన్ని వదిలిపెట్టాలని కొడుకుపై సలసల కాగే నీళ్లలో కారం కలిపి చల్లిన తల్లి

అలాగే, పోలింగ్ ముగింపు సమయానికి 48 గంటల ముందు ఎలక్ట్రానిక్ మీడియాలో ఎగ్జిట్ పోల్స్ ను ప్రచారం చేయొద్దని గురువారం నాడు విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. పోలింగ్ ముగిసిన తర్వాత మాత్రమే ఎగ్జిట్ పోల్స్‌ ప్రకటించుకునే అవకాశం ఉందని ఈసీ సూచించింది. కాగా, లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా వేర్వురు దశల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మరో వైపు 12 రాష్ట్రాల్లోని 25 అసెంబ్లీ నియోజకవర్గాలకు సైతం ఉప ఎన్నికలు జరగనున్నాయి అని ఎన్నికల సంఘం షెడ్యుల్ లో తెలిపింది.

Exit mobile version