Site icon NTV Telugu

Janasena Symbol: జనసేనను వదలని సింబల్ టెన్షన్..

Janasena

Janasena

జనసేన పార్టీని వదలని సింబల్ టెన్షన్ కొనసాగుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ఫ్రీ సింబల్స్ జాబితాలో గాజు గ్లాస్ ఉంది. దీంతో ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తు కేటాయించొద్దని కోర్టులో జనసేన పిటిషన్ దాఖలు చేసింది. అయితే, తమకు సింబల్ టెన్షన్ ఏం లేదని జనసేన నేతలు అంటున్నారు. ప్రతి ఏడాది ఏప్రిల్ నెలలో ఇదే తరహాలో ఫ్రీ సింబల్స్ విడుదల చేస్తూనే ఉంటుందని జనసేన పేర్కొనింది. తెలంగాణలోనూ ఇదే తరహా లొల్లి పెట్టారని గుర్తు చేస్తున్నారు. ఫ్రీ సింబల్ జాబితాలో ఉన్న గాజు గ్లాసును తమకే కేటాయించామని కేంద్ర ఎన్నుకల సంఘాన్ని కోరతామని జనసైనికులు అంటున్నారు.

Read Also: Viral Video: క్యా టాలెంట్‌ యార్.. తన ఆర్ట్ తో బైక్‌ రూపాన్నే మార్చేసిన మహిళ..!

అయితే, త్వరలో కేంద్ర ఎన్నికల సంఘానికి రిప్రజెంటేషన్ ఇస్తామని జనసేన పార్టీ శ్రేణులు వెల్లడించారు. ఇది రెగ్యులర్ ప్రొసీజర్ అని పేర్కొనింది. ప్రత్యర్థి పార్టీలు కావాలనే దీన్ని నానా యాగీ చేసే ప్రయత్నం చేస్తున్నాయని పార్టీ నేతలు తెలిపారు. ఇక, ఈ విషయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు సమాచారం. అయితే, జనసేన పోటీలో లేని చోట గ్లాస్ సింబల్ ను ఇండిపెండెంట్ అభ్యర్థులకు కేటాయించే ఛాన్స్ ఉంటుంది. ఇది జనసేనతో పాటు కూటమి పార్టీల విజయావకాశాలపై ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version