తరుణ్ భాస్కర్ లీడ్ రోల్ లో నటిస్తున్న ‘ఓం శాంతి శాంతి శాంతిఃలో ఈషా రెబ్బా హీరోయిన్ గా నటిస్తున్నారు. A R సజీవ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు నిర్మిస్తుండగా, కిషోర్ జాలాది, బాల సౌమిత్రి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఓం శాంతి శాంతి శాంతిః జనవరి 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానున్న సందర్భంగా ఈషా రెబ్బా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
Also Read :Padma Awards Benefits : పద్మ పురస్కారాల పవర్ ఏంటి.? అవార్డు గ్రహీతలకు లభించే రాజ మర్యాదలు ఇవే.!
ట్రైలర్ లో చెంప దెబ్బలు కనిపించాయి.. నిజంగానే కొట్టారా? అని ఆమెను అడిగితే నేను కొంచెం యాక్షన్ ఉన్న సినిమాలని ఇష్టపడతాను. ఇందులో చెంప దెబ్బలు ఉన్నాయి. ఒక దెబ్బ చెంపకి తగిలేలా ఉండాలి. చట్నీ చెంపకి అంటుకునేలా ఒక సీన్ ఉంది. అది రావాలంటే ఖచ్చితంగా కొట్టాల్సిందే. ఆ రకంగా నిజంగానే గట్టిగా ఒక చెంప దెబ్బ తగిలింది( నవ్వుతూ). ఆ సీన్ లో నా కళ్ళల్లో వచ్చిన నీళ్లు రియల్. ఇందులో ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంది. ఆ సీన్ లో తరుణ్ కి నాకు ఇద్దరికీ దెబ్బలు తగిలాయి అని ఆమె అన్నారు. తరుణ్ భాస్కర్ గారితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన స్వతహాగా దర్శకుడు. అయితే ఈ సినిమా వరకు మాత్రం ఆయన ఫోకస్ మొత్తం నటనపైనే వుంది. ఏ రోజు కూడా ఆయన దర్శకుడికి సలహాలు, మానిటర్ చూడటం నేను చూడలేదు.
