Site icon NTV Telugu

ECI removed 334 unrecognized political parties: 334 పార్టీలు ఔట్.. నిబంధనలు వర్తిస్తాయన్న ఈసీ..!

03

03

ECI removed 334 unrecognized political parties: దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 29A నిబంధనల ప్రకారం ECIలో నమోదు చేయబడ్డాయి. అన్ని రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్ కోసం మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నాయని, ఒక పార్టీ వరుసగా 6 ఏళ్లు ఎన్నికల్లో పోటీ చేయకపోతే, దానిని నమోదైన పార్టీల జాబితా నుంచి తొలగిస్తారని ఈసీ స్పష్టం చేసింది. ఇప్పుడు దేశంలో 6 జాతీయ పార్టీలు, 67 రాష్ట్ర పార్టీలు, 2854 నమోదైన గుర్తింపు లేని రాజకీయ పార్టీలు ఉన్నాయని ఈసీ తెలిపింది. 334 నమోదైన గుర్తింపు లేని రాజకీయ పార్టీలను (RUPP)లను శనివారం ఎన్నికల సంఘం జాబితా నుంచి తొలగించింది. నిబంధనల మేరకే గుర్తింపు లేని పార్టీలను రిజిస్టర్డ్ జాబితా నుంచి తొలగించినట్లు ఈసీ స్పష్టం చేసింది.

READ MORE: Operation Sindhoor: ఆపరేషన్ సింధూర్‌పై బిగ్ అప్డేట్.. ఎన్ని పాక్ ఫైటర్ జెట్లు కూల్చేశామంటే..!

ప్రయోజనాలు పొందుతూ.. షరతులు పాటించలేదు..
రాజకీయ పార్టీగా నమోదు చేసుకున్న ఏదైనా సంస్థ పన్ను మినహాయింపు వంటి కొన్ని ప్రత్యేక హక్కులు, ప్రయోజనాలను పొందుతుంది. రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా.. 2019 నుంచి ఏ లోక్‌సభ లేదా రాష్ట్ర-కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీ లేదా ఉప ఎన్నికలలో పోటీ చేయని, వాస్తవంలో గుర్తించలేని పార్టీలను జాబితా నుంచి తొలగించడం లక్ష్యంగా ఈసీ చర్యలకు దిగింది. రాజకీయ వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావాలనే లక్ష్యంతో ఎన్నికల కమిషన్ జూన్‌లో ఈ దిశగా చర్యలను స్టార్ట్ చేసింది.

ఈక్రమంలో ECIలో నమోదైన 3 వేలకు పైగా RUPPలలో, దాదాపు 300 పైగా RUPPలు తమ ఉనికిని నమోదు చేసుకోవాలనే తప్పనిసరి షరతును నెరవేర్చడం లేదని గమనించింది. ఈనేపథ్యంలో ఈసీ దీనిని గుర్తించడానికి దేశవ్యాప్తంగా ఒక కసరత్తును ప్రారంభించింది. ఆ కసరత్తు ఫలితమే ఈ 334 నమోదైన గుర్తింపులేని రాజకీయ పార్టీల తొలగింపు. పన్ను మినహాయింపు వంటి ప్రత్యేక హక్కులు, ప్రయోజనాలను అనుభవిస్తున్న ఈ పార్టీలు.. 2019 నుంచి గత ఆరు సంవత్సరాలలో ఒక్క ఎన్నికల్లో కూడా పోటీ చేయాలనే తప్పనిసరి షరతును నెరవేర్చలేదు. దీని కారణంగా కమిషన్ ఈ పార్టీలను రిజిస్టర్డ్ జాబితా నుంచి తొలగించింది.

ఉత్తర్వులపై 30 రోజుల్లోపు అప్పీల్ చేయవచ్చు..
జాబితా నుండి ఏ పార్టీని అన్యాయంగా తొలగించకుండా చూసుకోవడానికి, సంబంధిత రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల CEOలు అటువంటి RUPPలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత ఈ పార్టీలకు సంబంధిత CEOలు విచారణ ద్వారా అవకాశం ఇచ్చారు. అందరి వివరణ విన్న తర్వాత, గత 6 ఏళ్లలో ఈ 334 పార్టీలు ఒక్క ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదని వెలుగులోకి వచ్చింది. అటువంటి పరిస్థితిలో ఈ పార్టీలను జాబితా నుంచి తొలగించినట్లు తెలిపింది. ఈసీ జారీ చేసిన ఉత్తర్వులపై ప్రభావిత పార్టీ 30 రోజుల్లోపు అప్పీల్ చేసుకునే వెసులుబాటు ఉంది. తొలగించబడిన RUPPలు ఇకపై RP చట్టంలోని సెక్షన్ 29B, సెక్షన్ 29C నిబంధనల ప్రకారం ఎటువంటి ప్రయోజనాలను పొందేందుకు అర్హులు కారని ఈసీ స్పష్టం చేసింది.

READ MORE: War 2 : కియారా ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్?

Exit mobile version