Site icon NTV Telugu

Earthquke: మెక్సికోలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 6.4గా నమోదు

Maxico

Maxico

మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 6.4గా నమోదైంది. మెక్సికోలోని చియాపాస్ కోస్ట్ సమీపంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది. భూకంపం 10 కిమీ (6.21 మైళ్లు) లోతులో సంభవించిందని జీఎఫ్‌జెడ్ తెలిపింది. అప్రమత్తమైన అధికారులు రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపట్టారు. ఎంత నష్టం జరిగింది. ఎవరైనా చనిపోయారా? అన్నది ఇంకా తెలియలేదు. భూప్రకంపనలకు ప్రజలు భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది. కుదుపులు చోటుచేసుకోగానే ప్రజలు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీసినట్లు సమాచారం.

Exit mobile version