Site icon NTV Telugu

Earthquake : ఇండోనేషియాలో బలమైన భూకంపం.. రిక్టర్ స్కేలు పై 6.2 నమోదు

Earthquake

Earthquake

Earthquake : ఇండోనేషియాలోని పపువా ప్రాంతంలో బలమైన భూకంపం సంభవించింది. శనివారం రాత్రి 10.46 గంటలకు సంభవించిన ఈ భూకంపం తీవ్రత 6.2గా నమోదైంది. భూకంపం 77 కిలోమీటర్ల లోతులో ఉంది. ప్రస్తుతం ఈ శక్తివంతమైన భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. ఇండోనేషియా వాతావరణ విభాగం సునామీ ప్రమాదమేమీ లేదని, అయితే మరికొన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రస్తుతం ఈ శక్తివంతమైన భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. కొన్ని చోట్ల భూకంప తీవ్రత 6.3, 6.5గా నమోదైంది.

Read Also:Surya Stotram: ఈ స్తోత్ర పారాయణం చేస్తే శుభవార్త వింటారు

యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం, ఇండోనేషియాలోని పపువా ప్రాంతంలో సంభవించిన భూకంప తీవ్రత 6.5. దీని కేంద్రం రాజధాని జయపురాలోని అబేపురాకు ఈశాన్యంగా 162 కిలోమీటర్ల దూరంలో ఉంది. దాని లోతు 10 కిలోమీటర్ల దిగువన ఉంది. వాస్తవానికి, అబేపురా జనాభా 62,250 మాత్రమే. ఇండోనేషియాలోని అతి తక్కువ జనాభా కలిగిన నగరాల్లో ఇది ఒకటి. ఫిబ్రవరిలో కూడా ఇక్కడ భూకంపం వచ్చింది. నలుగురు వ్యక్తులు మరణించారు.

Read Also:Delhi: రాజధానిలో డేగ కళ్లతో నిఘా.. ఎక్సాట్రాలు చేస్తే జైలుకే

ఇండోనేషియాలో భూకంపం సర్వసాధారణం
27 కోట్ల జనాభా ఉన్న ఇండోనేషియాలో ప్రతిరోజూ భూకంపాలు, అగ్నిపర్వతాలు పేలుతున్నట్లు నిరంతరం వార్తలు వస్తున్నాయి. నవంబర్ 21న పశ్చిమ జావాలో 5.6 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 331 మంది మరణించారు. 600 మందికి పైగా గాయపడ్డారు. 2018లో సులవేసిలో సంభవించిన భూకంపం, సునామీ 4,340 మందిని చంపిన తర్వాత ఇండోనేషియాలో ఇది అత్యంత ఘోరమైనది.

Exit mobile version