NTV Telugu Site icon

Earthquake: అండమాన్‌ నికోబార్‌, జపాన్, కాలిఫోర్నియాలో భూకంపం

Earthquake

Earthquake

అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం మరోసారి వచ్చింది. ఇవాళ ( శుక్రవారం ) తెల్లవారుజామున 2.56 గంటలకు పోర్ట్ బ్లేయిర్ సమీపంలో భూమి కంపించింది. దీని తీవ్రత రికార్ట్ స్కేలుపై 4.3 గా నమోదు అయిందని సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. పోర్ట్ బ్లేయిర్ కు 112 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదిలికలు సంభవించినట్లు పేర్కొంది. ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరుగలేదు అని అధికారులు తెలిపారు.

Read Also: Astrology: ఆగస్టు 11, శుక్రవారం దినఫలాలు

ఇక, జపాన్ దేశంలో కూడా ఇవాళ భారీ భూకంపం సంభవించింది. జపాన్ తో పాటు కాలిఫోర్నియాలో కూడా భూకంపం సంభవించింది. జపాన్ దేశంలోని హోక్కైడో ప్రాంతంలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0గా నమోదైందని జర్మన్ రీసెర్చ్ ఫర్ జియో సైన్సెస్ వెల్లడించింది. భూకంపాలకు నిలయమైన జపాన్ దేశంలో వచ్చిన భూకంపం 46 కిలోమీటర్ల లోతులో సంభవించిందిని అధికారులు పేర్కొన్నారు.

Read Also: Adipurush Movie OTT: ఓటీటీలోకి వచ్చేసిన ఆదిపురుష్‌.. స్ట్రీమింగ్‌ ఎక్కడో తెలుసా?

అగ్రదేశం అమెరికాలోని కాలిఫోర్నియాలో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 4.3 గా నమోదైంది. కాలిఫోర్నియాలోని పార్క్ ఫీల్డ్ ప్రాంతంలో సంభవించిన ఈ భూకంపంపై యూఎస్ జియోలాజికల్ సర్వే ట్వీట్ చేసింది. వరుసగా భూకంపాలు సంభవించడంతో అక్కడి స్థానిక ప్రజలు తీవ్ర భయందోళనకు గురౌతున్నారు. అయితే, అధికారులు మాత్రం భూకంపాలు సంభవించినప్పుడు తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. భూకంపం వస్తుందని తెలిసిన వెంటనే ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు వచ్చిన ఖాళీ ప్రదేశాల్లో సేప్ గా ఉండాలని అధికారులు తెలియజేశారు.